Sports Jobs 2022: క్రీడల్లో కెరీర్‌ అవకాశాలు! డైరెక్టరేట్‌ ఆఫ్‌ యూత్‌ అఫైర్స్‌ అండ్ స్పోర్ట్స్‌లో భారీగా ఉద్యోగాలు.. అర్హతలివే..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ యూత్‌ అఫైర్స్‌ అండ్ స్పోర్ట్స్.. 100 జూనియర్ ఫిజికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల (Jr Physical Instructor posts) భర్తీకి అర్హులైన

Sports Jobs 2022: క్రీడల్లో కెరీర్‌ అవకాశాలు! డైరెక్టరేట్‌ ఆఫ్‌ యూత్‌ అఫైర్స్‌ అండ్ స్పోర్ట్స్‌లో భారీగా ఉద్యోగాలు.. అర్హతలివే..
Directorate Of Youth Affair
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 03, 2022 | 11:02 AM

Directorate of Youth Affairs and Sports Consultant Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ యూత్‌ అఫైర్స్‌ అండ్ స్పోర్ట్స్.. 100 జూనియర్ ఫిజికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల (Jr Physical Instructor posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో క్రీడాపోటీల్లో పాల్గొని ఉండాలి అలాగే దరఖాస్తుదారుల వయసు జూన్‌ 30, 2022వ తేదీ నాటికి ఖచ్చితంగా 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 16, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,400ల నుంచి రూ.67,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: The Director, Youth Affairs and Sports, Shiksha Bhavan, 4th Floor, Office Lane, Agartala – 799001.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.