- Telugu News Photo Gallery Asia Cup India vs Pakistan Exciting battle to begin tomorrow: Team India Great practice Photos goes Viral on social media
IND vs PAK 2022: రేపే భారత్-పాక్ ఉత్కంఠ పోరు! మైదానంలో టీమిండియా కసరత్తులవైపు ఓ లుక్కేస్కోండి..
తింటే గారెలు తినాలి.. చూస్తే ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ చూడాలనే బలమైన కోరిక మన నరనరాల్లో ఎప్పటినుంచో జీర్ణించుకుపోయింది. ఆ.. మజానే వేరు. మొన్నటి మ్యాచ్‌లో భారత్-పాక్ పోరు ఆధ్యాంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఇక రేపు..
Updated on: Sep 03, 2022 | 2:03 PM

తింటే గారెలు తినాలి.. చూస్తే ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ చూడాలనే బలమైన కోరిక మన నరనరాల్లో ఎప్పటినుంచో జీర్ణించుకుపోయింది. మొన్నటి మ్యాచ్‌లో భారత్-పాక్ పోరు ఆధ్యాంతం ఉత్కంఠభరితంగా సాగింది. రేపు మరోమారు ఈ రెండు టీంలు తలపడనున్నాయి.. నేటి నుంచి ప్రారంభమైన సూపర్ 4 ఆసియా కప్ 2022 మ్యాచ్ మరింత ఉత్కంఠ భరింతంగా జరనున్నాయి. సూపర్ 4 షెడ్యూల్ చూస్తే ఈ విషయం అవగతమవుతుంది.

ఈ రోజు తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక జట్లు తలపడనుండగా.. రేపు (ఆదివారం) భారత్-పాక్ మధ్య మరో మ్యాచ్ ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భారత్-పాక్‌ల మధ్య మళ్లీ ఉత్కంఠభరితమైన పోరును చూసేందుకు క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అటు టీమిండియా ఆటగాళ్లు కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

యుజ్వేంద్ర చాహల్ బాంబ్ షెల్ ప్రాక్టీస్ చేస్తుండగా, రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్ టోర్నీకి దూరమయ్యాడు.

ఇక రవీంద్ర జడేజా తప్పుకోవడంతో అతని స్థానంలో అశ్విన్ లేదా రవి బిష్టోయ్ ఈ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 6న శ్రీలంకతో భారత్ ఆడనుంది. సెప్టెంబర్ 8న భారత్-అఫ్ఘానిస్థాన్‌లు తలపడనున్నాయి.

సెప్టెంబర్ 11న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆసియా కప్ 2022 ఫైనల్ పోరు జరగనుంది.

అర్ష్ దీప్ సింగ్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నాడు

బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దినేష్ కార్తీక్




