Menopause diet: మెనోపాజ్‌కు కళ్లెం వేయాలంటే మీ జీవనశైలిలో ఈ మార్పులు తప్పనిసరి..

ప్రతి ఆడపిల్లకు పుట్టినప్పుడు దాదాపు పది నుంచి ఇరవై లక్షల అండాలతో పుడుతుంది. కాలక్రమేణా తగ్గుతూ రుతుచక్రం మొదలయ్యే సమయం నాటికి 3 - 4 లక్షల అండాలు మత్రమే మిగులుతాయి. ప్రతీ నెలా ఠంచన్‌గా వచ్చే నెలసరి..

Menopause diet: మెనోపాజ్‌కు కళ్లెం వేయాలంటే మీ జీవనశైలిలో ఈ మార్పులు తప్పనిసరి..
Menopause Diet
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 04, 2022 | 2:26 PM

Menopause weight gain: ప్రతి ఆడపిల్లకు పుట్టినప్పుడు దాదాపు పది నుంచి ఇరవై లక్షల అండాలతో పుడుతుంది. కాలక్రమేణా తగ్గుతూ రుతుచక్రం మొదలయ్యే సమయం నాటికి 3 – 4 లక్షల అండాలు మత్రమే మిగులుతాయి. ప్రతీ నెలా ఠంచన్‌గా వచ్చే నెలసరి, ఒక్కోసారి తప్పటడుగులు వేస్తూ 2, 3 నెలలకోసారి పలకరిస్తుంది. వచ్చిన ప్రతీసారి కడుపు నొప్పితో ప్రారంభమయ్యి.. కళ్లు తిరిగిపడిపోయేంత భీభత్సం సృష్టిస్తుంది. ఇక మహిళల్లో వయసు పెరిగే కొద్దీ అలారంలా కొన్ని సూచనలు జారీ చేస్తుంది. మోనోపాజ్‌ (పీరియడ్స్‌ ఆగిపోయే సమయం)కు సంకేతాలివే. స్త్రీ పునరుత్పత్తి వయసు అయిపోయిందనడానికి ఇది సూచన అన్నమాట. అంటే ఇక అండాల నిల్వ అనేది పూర్తిగా తరగిపోతుందన్నమాట. దీనితోపాటే కొన్ని హార్మోన్లు (ఈస్ట్రోజెన్) కూడా విడుదలవ్వడం ఆగిపోతుంది. అందువల్ల మోనోపాజ్‌ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాదారణంగా 45 నుంచి 55 యేళ్లల మధ్య వయసు వారికి మోనోపాజ్‌ ప్రారంభమవుతుంది. ఈ టైంలో ముఖ్యంగా పోషకాహారం, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే దీనిని ఎదుర్కోవడం సులభమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

తినకూడనివి.. ఆహార అలవాట్లు మార్చుకోకపోతే శరీరం నుంచి వేడి ఆవిర్లు, బరువు పెరగడం, నిద్రలేమి వంటి సమస్యలు దాడి చేస్తాయి. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఆల్కహాల్, కెఫిన్, మసాలా వంటకాలు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు అస్సలు తీసుకోకూడదు.

తినాల్సిన ఆహారాలు ఏవంటే.. మోనోపాజ్‌ సమయంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలు అధికంగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, బచ్చలికూర, బ్రొకోలీ, టమాట, వంకాయలు వంటి వాటిని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది హార్మోన్ల అసమతుల్యతను స్థిరీకరించడమే కాకుండా వృద్ధాప్య ప్రక్రియను కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. పండ్లు, కూరగాయలతోపాటు సోయా ఉత్పత్తులు, కాయధాన్యాలు, టోఫు, అవిసె గింజలు, నువ్వులు వంటి గింజలు, విత్తనాలు తీసుకోవాలి. కాల్షియం, ఒమేగా-3, ఐరన్,మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహారాలు కూడా మెనోపాజ్‌ సమస్యకు ఉపశమనం కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

జీవనశైలి ఈ మార్పులు చేసుకోవాలి.. 40, 50 ప్రారంభంలో ఒత్తిడితో కూడుకున్న పనులు చేయకపోవడం మంచింది. అలాగే తగినంత నిద్ర కూడా అవసరం. దీనితోపాటు చిన్నపాటి వ్యాయామాలు కూడా అలవాటు చేసుకోవాలి. మోనోపాజ్‌ సమయంలో ఆరోగ్యానికి ఖచ్చితంగా కొంత టైం కేటాయించుకోవాలి. ఈ సమయంలో శరీరానికి, మనసుకు మరింత విశ్రాంతి అవసరమనే విషయం మర్చిపోకూడదు.