Adulterated Milk: కల్తీ పాలను గుర్తించేందుకు సరికొత్త పద్ధతి.. ఇంట్లోనే ఈజీగా చెక్‌ చేసుకోండిలా..!

ఈ చిట్కాలను ప్రయత్నించి,.. మీ ఇంట్లో కల్తీ పాలు వాడుతున్నట్టయితే..వెంటనే మానేయండి.. అది మీ ఇంట్లోని వారందరికీ ఆరోగ్యదాయకం.

Adulterated Milk: కల్తీ పాలను గుర్తించేందుకు సరికొత్త పద్ధతి.. ఇంట్లోనే ఈజీగా చెక్‌ చేసుకోండిలా..!
Milk Benefits
Follow us

|

Updated on: Sep 06, 2022 | 4:04 PM

Adulterated Milk: మనలో చాలా మంది పాలు తాగకుండా పనిచేయలేరు. ఉదయం అల్పాహారం, టీలో పాలు చాలా ముఖ్యమైనవి. ఇంట్లో పిల్లలకు కూడా పాలు తప్పనిసరి కావాలి. ప్రతి రోజూ ఉదయం చాలా ఇళ్లలో కొన్ని వంటకాలను తరచుగా పాలతో తయారుచేస్తారు. అలాంటి పాలు స్వచ్ఛమైనవా లేదంటే.. కల్తీవా అని మీరు అనుమానించినట్లయితే..మీరు మీ ఇంట్లోనే పాల నాణ్యత, స్వచ్ఛతను తనిఖీ చేసుకోవచ్చు. అవును, ఇంట్లో పాలను పరీక్షించడం చాలా సులభం. పాల స్వచ్ఛతను ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలలో కల్తీని తనిఖీ చేసే పద్ధతులు… మీరు తీసుకొచ్చే పాలలో ఏదైనా సింథటిక్ ఉంటే పాల వాసనను గుర్తించడం చాలా సులభం. పాలు మరుగుతున్నప్పుడు దాని వాసన మెల్లగా మొదలవుతుంది. సింథటిక్ పాలను దాని చెడు రుచి, వాసన ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఒక్కోసారి పాలు సబ్బు వాసన వస్తుంటాయి. మీరు ఆ పాలను చేతి వేళ్లతో తీసుకుని కూడా చెక్‌ చేయవచ్చు. కొంచెం పాలను తీసుకుని చేతిలో వేసుకుని రుద్దినట్టయితే..కాస్త సబ్బుగా అనిపిస్తే రసాయనాల మిశ్రమంతో తయారైందని అర్థం.

పాలు కింద పడిపోయినప్పుడు, అది వెంటనే ప్రవహిస్తుంది. దాదాపు అందరికీ ఇదే తెలుసు. కానీ, అసలు పాలు ఎలా ప్రవహిస్తాయో తెలుసా? పాలలో కల్తీని అరికట్టడానికి ఇది సులభమైన మార్గం. ఏదైనా మృదువైన ఉపరితలంపై 2-3 చుక్కల పాలను వేయండి. అది మెల్లగా ఏదో ఒకవైపుకు పారుతుంది. అలా పాలు పారిన దారిలో తెల్లగా కనిపిస్తే అవి స్వచ్ఛమైన పాలే. కల్తీ పాలు అయితే వేగంగా పారుతాయి. పాలు పారిన దారిలో తెల్లగా ఏమీ కనిపించదు.

ఇవి కూడా చదవండి

అనేక వస్తువులను పాలతో తయారు చేస్తారు. వీటిని మనం స్వీట్ల తయారీ నుండి వంట వరకు చాలా వస్తువులలో ఉపయోగిస్తాము. పాలతో చేసిన ఖోవాను స్వీట్లకు ఉపయోగిస్తారు. పాలను గుర్తించడానికి ఇంట్లోనే ఖోవా తయారు చేయడానికి ప్రయత్నించండి. పాలు ఖోవా అయ్యే వరకు చెంచాతో కలుపుతూ తక్కువ మంట మీద మరిగించండి. మంటమీద నుండి తీసివేసి 2-3 గంటలు వేచి ఉండండి. ఘన ఖోవా నూనెగా ఉంటే, పాలు మంచి నాణ్యతతో ఉంటాయి. అది రాయిలా గట్టిగా ఉంటే, పాలు సింథటిక్ అని అర్థం.

యూరియా.. పాల కల్తీకి అత్యంత సాధారణ రూపం. ఇది రుచిని మార్చదు. గుర్తించడం చాలా కష్టం. యూరియా ప్రమాదకరమైనది. మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. పాలలో యూరియాను గుర్తించేందుకు లిట్మస్ పేపర్‌ను ఉపయోగించాలి. ఇందుకోసం.. కొన్ని పాలు, సోయాబీన్ లేదా సోయాబీన్‌ని వేసి పొడి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత అందులో ఎర్రని లిట్మస్ పేపర్ ముంచాలి. ఆ పేపర్ ఎరుపు రంగు నుండి నీలి రంగులోకి మారితే అందులో యూరియా ఉన్నట్టే. ఆ పాలు విషంతో సమానం.

ఈ పద్ధతుల్లో కొన్నింటి ద్వారా పాలలో కల్తీని గుర్తించడం సులభం. ఈ చిట్కాలను ప్రయత్నించి,.. మీ ఇంట్లో కల్తీ పాలు వాడుతున్నట్టయితే..వెంటనే కల్తీ పాలు తీసుకోవడం మానేయండి.. అది మీ ఇంట్లోని వారందరికీ ఆరోగ్యదాయకం.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles