Heart Health: గుండెపోటు ప్రమాదాన్ని నిరోధించే 5 ముఖ్యమైన ఆహారాలివే..
Heart Health: మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనం మంచి ఫుడ్ తీసుకుంటే బాగుంటాం.. కాదని ఏది పడితే అది తింటే అనారోగ్యానికి..
Heart Health: మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనం మంచి ఫుడ్ తీసుకుంటే బాగుంటాం.. కాదని ఏది పడితే అది తింటే అనారోగ్యానికి గురికాక తప్పదు. అయితే, ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దానికి కారణం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడమే. మరి జీవితంలో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలన్నా, గుండెపోటు రాకుండా ఉండాలన్నా మంచి ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ఇవాళ మనం గుండెపోటు నుంచి కాపాడే 5 ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పదార్థాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి పాటిల్ తెలిపారు.
1. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు..
గుండె ఆరోగ్యం కోసం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్న సాల్మన్, ట్యూనా వంటి చేపలను తినడం వల్ల ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది. వాల్‌నట్‌లు, అవిసె గింజలు, రాజ్మా వంటి ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారం కూడా రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచడంలో సహాయపడుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
2. ప్రాసెస్ చేసిన ధాన్యాల కంటే తృణధాన్యాలు తీసుకోవడం మంచిది..
ప్రాసెస్ చేసిన ధాన్యాలు అనారోగ్యాకి కారణం అవుతాయి. వీటిలో పోషకాలు ఏమీ ఉండవు. దీని స్థానంలో ఫైబర్ అధికంగా కలిగిన తృణధాన్యాలు తీసుకోవడం ఉత్తమం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ధాన్యాలను ప్రాసెస్ చేస్తున్నప్పుడు వాటిలోని ఫైబర్ తొలగిపోతుంది. ఈ ఆహారాలు తీసుకోవడం వలన ఊబకాయం, పోషకాహార లోపం ఏర్పడుతుంది. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్, సాధారణ పాస్తా కంటే హోల్ వీట్ పాస్తా, కార్న్ ఫ్లేక్స్ కంటే ఓట్స్ తీసుకోవడం చాలా మంది.
3. పండ్లు, కూరగాయలు తినాలి..
ఆరోగ్యవంతమైన జీవితం కోసం రోజూ పండ్లు తినడం ఉత్తమం. పండ్లు, కూరగాయలలో విటమిన్లు A, C, E, పొటాషియం, ఫోలిక్ యాసిడ్‌లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
4. సంతృప్త కొవ్వులు కలిగిన ఆహారాలు తినడం తగ్గించండి..
సంతృప్త కొవ్వులు కలిగిన గొడ్డు మాంసం, పంది మాంసం, గొర్రె మాంసం, పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవద్దు. ఇది మీ రక్తంలో LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. LDL ధమనులలో రక్తాన్ని అడ్డుకుంటుంది. సంతృప్త కొవ్వులను తగ్గించడానికి మాంసం వండే ముందు.. దానిపై కనిపించే కొవ్వు మొత్తాన్ని తీసేయాలి.
5. తక్కువ ఫ్యాట్స్ ఉన్న పాల ఉత్పత్తులను తీసుకోవాలి..
పాలు, పాల ఉత్పత్తులను ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. అయితే, వీటిని ఎక్కువ స్థాయిలో తీసుకుంటే మాత్రం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. చీజ్, ఐస్ క్రీమ్, సోర్ క్రీమ్ వంటి పాల ఉత్పత్తులలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో తక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న పాల ఉత్పత్తులను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..