Health Tips: ఒంట్లో వేడి విపరీతంగా ఉందా? ఈ 5 పండ్లు మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి..
Health Tips: చాలా మంది అధిక శరీర ఉష్ణోగ్రత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం వలన పాదాల్లో పగుళ్లు,

Health Tips: చాలా మంది అధిక శరీర ఉష్ణోగ్రత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం వలన పాదాల్లో పగుళ్లు, ముక్కులోంచి రక్తం కారడం, పెదాలు పగలడం వంటివి జరుగుతుంది. ఈ వేడిని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. తెలిసీ తెలియక ఏవి పడితే అవి మెడిసిన్స్ వాడేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే శరీర అధిక ఉష్ణోగ్రత సమస్యకు చెక్ పెట్టే 5 ముఖ్యమైన పండ్ల గురించి నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వలన శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు. మరి ఆ 5 ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1.పుచ్చకాయ..
సాధారణంగా ఇవి వేసవి కాలంలో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. పుచ్చకాయలో విటమిన్ సి, ఫైబర్, లైకోపీన్ వంటి మూలకాలు ఉన్నాయి. ఇది క్యాన్యర్ రాకుండా కాపాడటంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇంకా పుచ్చకాయలో సిట్రులిన్, అర్జినైన్ వంటి అమైనో ఆమ్లాలు కూడా ఉన్నాయి. ఇవి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతాయి. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది.




2. స్ట్రాబెర్రీలు..
స్ట్రాబెర్రీలు చాలా ఆరోగ్యకరమైనవి. నారింజలో కంటే ఎక్కువ విటమిన్ సి ఇందులో ఉంది. దాంతోపాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫ్రీరాడికల్స్ డ్యామేజీ నుంచి రక్షించే యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తుంది.
3. నిమ్మకాయ..
నిమ్మకాయలు వ్యక్తిని రిఫ్రెష్ చేస్తాయి. దీనిని వేసవిలో తీసుకోవడం వలన అమితమైన ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, సాధారణ రోజుల్లో కూడా నిమ్మకాయ జ్యూస్ తీసుకోవచ్చు. గోరువెచ్చని నీరు, తేనె లో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. నిమ్మకాయ.. జలుబు, ఫ్లూ, ఫుడ్ పాయిజనింగ్ వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.
4. అరటిపండు..
అరటిపండులో పొటాషియం, విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడే పెక్టిన్‌ను కలిగి ఉంది. మెరుగైన జీర్ణక్రియకు ఉత్తమమైన పండు. అరటిపండ్లలో మెగ్నీషియం, రాగి కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవికూడా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
5. దోసకాయలు..
దోసకాయ వేసవిలో తింటే చలువ చేస్తుందంటారు. శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు తిన్నా ఫలితం ఉంటుంది. దోసకాయలో తక్కువ కేలరీలు ఉంటాయి. అదే సమయంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేట్‌గా ఉన్నప్పుడు దోసకాయ తింటే హైడ్రేట్ చేస్తుంది. దోసకాయతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..