Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nasal Covid-19 Vaccine: ఇక ముక్కు నుంచే కోవిడ్ వ్యాక్సిన్.. భారత్ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి

COVID Vaccine: ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎమ‌ర్జెన్సీగా వాడేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఇంట్రానాస‌ల్ కోవిడ్19 టీకాకు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు.

Nasal Covid-19 Vaccine: ఇక ముక్కు నుంచే కోవిడ్ వ్యాక్సిన్.. భారత్ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి
Nasal Covid 19 Vaccine
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 06, 2022 | 4:17 PM

భారత్‌ బయోటెక్ తయారు చేసిన నాసల్‌ వ్యాక్సిన్‌ DCGI అనుమతి ఇచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎమ‌ర్జెన్సీగా వాడేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఇంట్రానాస‌ల్ కోవిడ్19 టీకాకు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు. ఇండియాలో ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ టీకాకు అనుమ‌తి ద‌క్క‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకా అందుబాటులో ఉంది. కోవిడ్‌పై పోరాటంలో భారత్ ముందంజలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

BBIL ​​(భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్) ఇంట్రానాసల్ వ్యాక్సిన్ కోసం బూస్టర్ డోస్‌గా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి DCGI గతంలో అనుమతిని ఇచ్చింది. BBV-154 (ఇంట్రానాసల్) ఇమ్యునోజెనిసిటీ, భద్రతను కోవాక్సిన్‌తో పోల్చడానికి ఫేజ్-3 క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి డ్రగ్ రెగ్యులేటర్ సంస్థను అనుమతించింది.

గత వారం, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (SEC) భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (EUA)ని సిఫార్సు చేసింనట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేదని.. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని  కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.

భారత్ బయోటెక్ చెప్పినట్లుగా, నాసికా వ్యాక్సిన్:

  • COVID-19 సంక్రమణ, ప్రసారం రెండింటినీ నిరోధించే అవకాశం ఉంది
  • నాన్-ఇన్వాసివ్, సూది-రహితగా ఇది ఉంటుంది
  • శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు అవసరం లేదు కాబట్టి వ్యాక్సిన్ చేయడం చాలా సులభం
  • సూది-సంబంధిత ప్రమాదాలను తొలగిస్తుంది (గాయాలు, అంటువ్యాధులు)
  • పిల్లలు, పెద్దలకు అందరికి సరిపోతుంది
  • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను ఇవి తీర్చగలదు

మరిన్ని జాతీయ వార్తల కోసం