Viral Video: దోమలను వదిలించుకోవడానికి ఈజీ హోం రెమెడీ..! వైరలవుతున్న వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

వైరల్‌ అవుతున్న వీడియోలో మనం వేగంగా తిరుగుతున్న ఫ్యాన్‌ని చూడవచ్చు. అతని దగ్గరున్న వేప ఆకులు మండిపోతున్నాయి.

Viral Video: దోమలను వదిలించుకోవడానికి ఈజీ హోం రెమెడీ..!  వైరలవుతున్న వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Mosquito
Follow us

|

Updated on: Sep 06, 2022 | 7:17 PM

Viral Video: నగరమైనా, గ్రామమైనా దోమల బెడదతో ప్రతి వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు. ప్రతిఒకరి ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా లేకపోయినా, దోమల సమస్య మాత్రం తప్పనిసరిగా ఉంటుంది.. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల బెడద మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్న జీవులు రక్తాన్ని పీల్చడమే కాకుండా ప్రాణాంతక వ్యాధులను అంటగడుతుంటాయి. ఎప్పుడు చెవి దగ్గరే సౌండ్స్‌ చేస్తూ.. నిద్ర పాడు చేస్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడ కుడుతూ రక్తాన్ని పీల్చేస్తుంటాయి దోమలు. దోమల బెడదతో చిర్రెత్తిపోతుంటారు. ఇక ఇంట్లో ఉన్న దోమలను తరిమి కొట్టడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పట్టణాల్లో ప్రజలు దోమలను తరిమికొట్టేందుకు వివిధ పరికరాలను ఉపయోగిస్తుండగా, గ్రామస్థులు మాత్రం స్వదేశీ పద్ధతులను అవలంబిస్తున్నారు.

ఉదాహరణకు.. వేప ఆకులు, ఆవు పేడను కాల్చి పొగ పడుతుంటారు. మరి కొంతమంది ఈ స్వదేశీ పద్ధతులతో సాంకేతికతను మిళితం చేస్తారు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఒక టెక్నిక్‌తో దోమలను తరిమికొట్టాడు. అతడు పెట్టిన పొగ ఇంటర్‌నెట్‌నే షేక్‌ చేసేలా ఉంది. వీడియో చూసిన చాలామంది నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. 29 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న వీడియోలో మనం వేగంగా తిరుగుతున్న ఫ్యాన్‌ని చూడవచ్చు. అతని దగ్గరున్న వేప ఆకులు మండిపోతున్నాయి. దాని కారణంగా చాలా పొగ రావటం కనిపిస్తుంది. అదే పొగను గది అంతటా సరిగ్గా వ్యాప్తి చేయడానికి ఫ్యాన్ ఉపయోగించాడు.. ఇక, ఫ్యాన్ తిరుగుతున్న కొద్దీ పొగ అక్కడంతా వ్యాపిస్తుంది. అంటే, ఈ దేశీ జుగాడ్ చేసిన ప్రయత్నంతో వచ్చే పొగ గదిలో బాగా వ్యాపిస్తుంది. తద్వారా ప్రతి మూలలో దాక్కున్న దోమలు కూడా బయటకు వస్తాయి.

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు..రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. పొగపట్టే ముందు.. పశువులను దూరంగా పెట్టాలని అంటున్నారు. దీని కారణంగా వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి