Viral Video: వామ్మో దేవుడు లంచ్ మీటింగ్ లో ఉన్నాడా ఏంటీ.. రోడ్ యాక్సిడెంట్ నుంచి భలే ఎస్కేప్.. వీడియో వైరల్..

అదృష్టం మనతో ఉంటే మనం ఏం చేసినా చెల్లుతుందంటారు. అక్షరాలా ఇది నిజమే.. అదృష్టంఉంటే చావుకు మనం ఎదురెళ్లినా.. ఆ చావు కూడా వెనక్కి వెళ్లిపోతుంది.. ఇలాంటివన్ని ఏదో ఊరికే రాలేదు. ఎన్నో సంఘటనలు ఇలాంటి సామెతలు రావడానికి కారణం. సాధారణంగా ఎవరైనా..

Viral Video: వామ్మో దేవుడు లంచ్ మీటింగ్ లో ఉన్నాడా ఏంటీ.. రోడ్ యాక్సిడెంట్ నుంచి భలే ఎస్కేప్.. వీడియో వైరల్..
Car Accident
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 06, 2022 | 6:50 PM

Viral News: అదృష్టం మనతో ఉంటే మనం ఏం చేసినా చెల్లుతుందంటారు. అక్షరాలా ఇది నిజమే.. అదృష్టంఉంటే చావుకు మనం ఎదురెళ్లినా.. ఆ చావు కూడా వెనక్కి వెళ్లిపోతుంది.. ఇలాంటివన్ని ఏదో ఊరికే రాలేదు. ఎన్నో సంఘటనలు ఇలాంటి సామెతలు రావడానికి కారణం. సాధారణంగా ఎవరైనా నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. నిర్లక్ష్యం కారణంగా జరిగే రహదారి ప్రమాదాలకు ప్రతి రోజూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాని.. అదృష్టం ఉంటే మాత్రం ఎంత ప్రమాదమైనా చిన్న గాయం కాకుండా బతికి బయటపడవచ్చు. రోడ్లు దాటేటప్పుడు చాలా మంది నిబంధనలు ఫాలో అవ్వరు. రహదారిపై వాహనాలు వస్తున్నా.. ఏదో మించిపోయినట్లు హడావుడిగా రోడ్డుకిరువైపులా చూసుకోకుండా రోడ్డు దాటేస్తారు. ఒక్కోసారి ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడతాం. కాని మనకు భూమి మీద నూకలు చెల్లితే ప్రమాదంలో మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాని అదృష్టం ఉంటే మాత్రం ప్రమాదానికి మనం ఎదురెళ్లినా మనకేం కాదు. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈవీడియోలో ఒక మహిళ నిర్లక్ష్యంగా.. రోడ్డుపై వాహనాలను చూసుకోకుండా రోడ్డు దాటుతుంది. రోడ్డు దాటేటప్పుడు ఎంతో వేగంగా కార్లు వస్తాయి. ఆమెను చూసి ఒక కారు బ్రేక్ వేయడానికి ప్రయత్నించి రోడ్డు పక్క డివైడర్ వైపు వెళ్లి బోల్తా కొట్టగా, వెనకాల వచ్చిన మరో కారు రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. సాధారణంగా ఇలాంటి ప్రమాదం జరిగితే బతికి బయటపడటం చాలా కష్టం.. కాని దేవుడు లంచ్ మీటింగ్ లో ఉన్నాడో ఏంటో గాని.. రోడ్డు ప్రమాదం నుంచి ఆమహిళ భలే ఎస్కేప్ అయింది. ఎలాంటి గాయం లేకుండానే సాధారణంగా నడుచుకుంటూ వెనక్కి వచ్చేసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియోలో ముగ్గురు మహిళలు రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా… వారిలో ఇద్దరు రోడ్లపై వెళ్లే వాహనాలను గమనిస్తూ.. రోడ్డు దాటేందుకు వేచిఉన్నారు. వారిలో ఒక మహిళ మాత్రం రహదారిపై వాహనాలను చూసుకోకుండా నిర్లక్ష్యంగా నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. ఆమెను గమనించిన వాహనదారులు వేగంగా వెళ్తున్న కారును కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికి ఒక కారు పక్కకు వెళ్లి పోయి బోల్తో కొట్టగా.. మరోక కారు ముందుకారు ఢీకొన్ని ఆమహిళను గుద్ది ముందుకు వెళ్లిపోయింది. ఈప్రమాదంలో మహిళకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈవీడియోను చూసిన నెటిజన్లు మాత్రం మహిళ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఆమె నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ViralHog (@viralhog)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..