Viral Video: ఆర్మీ కంటోన్మెంట్ ఆస్పత్రిలో ఏనుగుల బీభత్సం.. క్యాంటీన్ అద్దాలు పగులగొట్టి గోధుమ పిండి చోరీ..!
ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోను చూసిన వారు షాక్ అవుతున్నారు. ఆస్పత్రిలో ఏనుగులు ఎలా వచ్చాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Viral Video: ఆర్మీ కంటోన్మెంట్ ఆస్పత్రిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఆసుపత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఆహారం కోసం వెతికాయి. ఏనుగుల బీభత్సంతో ఆస్పత్రి సిబ్బంది హడలెత్తిపోయారు. భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనను దూరం నుంచి వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోను చూసిన వారు షాక్ అవుతున్నారు. ఆస్పత్రిలో ఏనుగులు ఎలా వచ్చాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Elephants in the room… From Jalpaiguri Cantonment. pic.twitter.com/ipbFR8bthG
ఇవి కూడా చదవండి— Susanta Nanda IFS (@susantananda3) September 4, 2022
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆస్పత్రిలో గజరాజులు.. జల్పాయిగురి కంటోన్మెంట్ ” అంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. “గజరాజు బెంగాల్‌లోని జల్పాయిగురి ఇండియన్ ఆర్మీ హాస్పిటల్‌లోకి ప్రవేశించాయి. తొండంతో క్యాంటీన్ లోపల వెతికాయి. చివరకు ఒక గోధుమపిండి ప్యాకెట్ ను పట్టుకుపోయాయి. ఈ ఘటనను హాస్పిటల్ లో ఉన్న వారు కొంచెం దూరం నుంచి వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఆ ఏనుగులు ఏ డాక్టర్ రూంకు వెళ్లాలో.. ఎవరిని సంప్రదించాలో.. తెలియక తికమక పడుతున్నాయి” అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అవి రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం వచ్చాయంటూ మరికొందరు ట్విట్ చేశారు.
#WATCH : When Gajraj entered inside Binnaguri #IndianArmy hospital in #Bengal and then got confused as which human doctor chamber to knock, who to visit. ? pic.twitter.com/MjYKEDh5pB
— Tamal Saha (@Tamal0401) September 5, 2022
ఈ ఘటనలో ఆసుపత్రి కారిడార్‌లో మూడు ఏనుగులు సంచరిస్తున్నట్టుగా చూడవచ్చు. ఉత్తర బెంగాల్‌లోని జల్పాయిగురి ప్రాంతంలో భారీ సంఖ్యలో ఏనుగులు ఉన్నాయని, అవి గ్రామాల్లోకి తరచూ ప్రవేశించే సంఘటనలు జరుగుతాయని స్థానికులు అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి