Viral Photo: ఈ క్యూట్ బబ్లీ అబ్బాయిలు ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్స్.. వీరెవరో గుర్తుపట్టగలరా ?..

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని బాషలకు చెందిన స్టార్స్ బాల్యస్మృతులు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఇద్దరు అన్నదమ్ముళ్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారెవరో తెలుసుకుందామా.

Viral Photo: ఈ క్యూట్ బబ్లీ అబ్బాయిలు ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్స్.. వీరెవరో గుర్తుపట్టగలరా ?..
Actors
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2022 | 6:05 PM

సినీ హీరోహీరోయిన్లను ఆరాధించేవారి సంఖ్య విపరీతంగా ఉంటుంది. సెలబ్రెటీలపై అభిమానం లెక్కలేనంతగా చూపిస్తుంటారు. వారి సినిమాలు రిలీజ్ అయితే.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి తెలిసిందే. భారీ కటౌట్స్.. పాలాభిషేకాలు చేస్తుంటారు. కేవలం హీరోస్ మాత్రమే కాదు.. హీరోయిన్లకు సైతం ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. వారి డ్రెస్సింగ్.. హెయిర్ స్టైల్స్ ఫాలో అయిపోతుంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా వల్ల తమ అభిమాన తారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల తారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని బాషలకు చెందిన స్టార్స్ బాల్యస్మృతులు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఇద్దరు అన్నదమ్ముళ్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారెవరో తెలుసుకుందామా.

పైన పోటోను చూశారు కదా.. ఆ ఇద్దరు క్యూట్ అండ్ బబ్లీ పిల్లలు ఇప్పుడు దక్షిణాదిలో సూపర్ స్టార్స్. ఇద్దరికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. గుర్తుపట్టండి. నిజానికి వారిద్దరూ తెలుగు హీరోస్ కాదు.. కానీ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానగణం ఉంది. ముఖ్యంగా ఈ ఇద్దరు బూరెబుగ్గల చిన్నారులకు ఇప్పుడు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. గుర్తుపట్టారా.

ఇవి కూడా చదవండి

వారెవరో కాదు. తమిళ్ స్టార్స్ సూర్య, కార్తీ. ఈ ఇద్దరు అన్నదమ్ముళ్లు.. సౌత్ ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్స్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఎవరికీ వారే తమ నటనతో ప్రేక్షకుల మనసులలో స్థానం ఏర్పర్చుకున్నారు. అన్నయ్య సూర్యతోపాటు.. తమ్ముడు కార్తీకి కూడా తెలుగులో ఫాలోయింగ్ ఉంది. అయితే సూర్య సినీ పరిశ్రమలోకి హీరోగా అరంగేట్రం చేసి నేటికి 25 ఏళ్లు పూర్తవుతుంది. ఈ క్రమంలోనే అన్నయ్యను విష్ చేస్తూ చిన్ననాటి ఫోటో షేరు చేసుకున్నారు కార్తీ. “అతను తన ప్రతి చిన్న మైనస్‏ను తన గొప్ప ప్లస్‌గా మార్చుకోవడానికి పగలు, రాత్రి కష్టపడ్డాడు. అతను తన విజయాలను అధిగమించడంపై మాత్రమే దృష్టి పెట్టాడు. ఎంతో సామాన్యంగా కనిపించే అతను.. ఇప్పటికీ వేలాది మంది పిల్లల జీవితాలను తీర్చిదిద్దాడు. తనే నా అన్నయ్య అంటూ ఎమోషనల్ మేసేజ్ షేర్ చేశారు కార్తీ. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.