Bigg Boss Season 6: బిగ్‏బాస్ షోలో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా ?..

బిగ్‏బాస్ సీజన్ 6లో ఇంట్లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ లలో చాలా మంది ప్రేక్షకులను తెలిసినవారే. సీరియల్స్, రియాల్టీ షోస్, వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నవారే.

Bigg Boss Season 6: బిగ్‏బాస్ షోలో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా ?..
Bigg Boss 6
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2022 | 4:05 PM

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్. అన్ని భాషలలో అత్యంత ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన ఈ షో.. ఇప్పుడు తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇక ఇటీవలే సీజన్ 6 గ్రాండ్‏గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజే ఈషోలోకి ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఇక ఇప్పటికే ఇంట్లో గేమ్ షూరు చేశాడు బిగ్‏బాస్. ఇక టాస్క్ ఇవ్వకముందే ఇంట్లో గొడవలు.. తిట్టుకోవడాలు స్టార్ట్ చేశారు హౌస్ మేట్స్. కొందరు ఇంటిసభ్యుల అతి.. ఓవరాక్షన్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే ఇక ఇప్పుడు బిగ్‏బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ గురించి పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బిగ్‏బాస్ సీజన్ 6లో ఇంట్లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ లలో చాలా మంది ప్రేక్షకులను తెలిసినవారే. సీరియల్స్, రియాల్టీ షోస్, వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నవారే. ఇక మరికొందరు అస్సలు తెలియని వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్‏బాస్ కంటెస్టెంట్లలో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న పర్సన్ కూడా ఒకరు ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ప్రస్తుతం అత్యంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ యూట్యూబర్ ఆదిరెడ్డి అని తెలుస్తోంది. ఇతడిని కామన్ మ్యాన్ ఎంట్రీ కింద బిగ్‏బాస్ ఇంట్లోకి పంపించారట మేకర్స్. ఆదిరెడ్డికి వారానికి రూ. 1.75 లక్షలు ఇస్తున్నట్లుగా సమాచారం. ఆది రెడ్డి గతంలో బిగ్‏బాస్ రివ్యూలు చెబుతూ వీడియోస్ చేస్తుండేవారు.