Suriya: సినీ పరిశ్రమలో హీరోగా 25 ఏళ్ల ప్రస్థానం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన సూర్య..

తనకు అండగా నిలబడి సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇది అందమైన ఆశీర్వాదమని పేర్కొన్నారు.

Suriya: సినీ పరిశ్రమలో హీరోగా 25 ఏళ్ల ప్రస్థానం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన సూర్య..
Suriya 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2022 | 3:02 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరో సూర్య స్థానం ప్రత్యేకం. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ సూర్యకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రజల మనసులలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు సూర్య. ఈరోజుకీ (సెప్టెంబర్ 6) సినీరంగంలోకి సూర్య అడుగుపెట్టి 25 ఏళ్లు. 1997లో నెరుక్కు నెర్ సినిమాతో ఇండిస్ట్రీలోకి అడుగుపెట్టాడు సూర్య. ఇప్పటివరకు దాదాపు 50 సినిమాల్లో నటించారు. తన 25 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ మేసేజ్ చేశారు సూర్య. తనకు అండగా నిలబడి సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇది అందమైన ఆశీర్వాదమని పేర్కొన్నారు.

“నిజంగా ఈ 25 సంవత్సరాలు నాకు అందమైన ఆశీర్వాదం. కలలు కనండి.. అలాగే వాటిని నమ్మండి. మీ సూర్య ” అంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 2 దశాబ్ధాల కెరీర్‏లో ఎన్నో మరపురాని పాత్రలను పోషించాడు. కేవలం హీరోయిజం మాత్రమే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించి మెప్పించారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో సినీరంగ ప్రవేశం చేశారు సూర్య. ఈ 20 ఏళ్లలో ఎన్నో అద్బుతమైన చిత్రాల్లో నటించారు. లవర్ బాయ్, ఆర్మీ ఆఫీసర్, మాస్ హీరో, న్యాయం కోసం పోరాడే లాయర్ ఇలా ఒక్కటేమిటీ ఎలాంటి పాత్రలలోనైనా జీవించగల సత్తా ఉన్న నటుడు. ఇప్పటివరకు సూర్య రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ సహా అనేక అవార్డ్స్ గెలుచుకున్నారు. అంతేకాకుండా.. ఆస్కార్ అవార్డుల వేడుక కమిటీకి ఆహ్వానం అందుకున్న ఏకైక దక్షిణాది నటుడు. అంతేకాకుండా అతను నటించిన జైభీమ్, ఆకాశమే నీ హద్దురా చిత్రాలు ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేయబడ్డాయి. ప్రస్తుతం సూర్య డైరెక్టర్ బాలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే నిర్మాత వెట్రిమారన్ తో జల్లికట్టు మూవీ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.