Ram Charan: కొత్త యాడ్ అదిరింది బాసు.. రష్మిక, గంగూలీ, రోహిత్‏తో కలిసి చరణ్ అలా.. 

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 06, 2022 | 2:31 PM

ఇక రష్మిక, గంగూలీ సైతం నటన ఇరగదీశారు. గతంలో చరణ్.. బాలీవుడ్ బ్యూటీ అలీయాతో కలిసి ఫ్రూటీకి అంబాసిడర్‏గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీరంత కలిసి నటించిన మీషో యాడ్ నెట్టింట సందడి చేస్తుంది.

Ram Charan: కొత్త యాడ్ అదిరింది బాసు.. రష్మిక, గంగూలీ, రోహిత్‏తో కలిసి చరణ్ అలా.. 
Ram Charan
Follow us

ప్రస్తుతం సినీ పరిశ్రమలోని అగ్రతారలందరూ యాడ్స్ చేస్తూ తెగ బిజీ అయిన సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్స్‏గా వ్యవహరిస్తూ.. ఆయా ప్రకటనల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, కేజీఎఫ్ స్టార్ యశ్ యాడ్స్ చేయగా.. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సైతం రంగంలోకి దిగిపోయాడు. కేవలం చెర్రీ మాత్రమే కాదు.. నేషనల్ క్రష్ రష్మిక.. రోహిత్ శర్మ.. గంగూలీ కూడా చరణ్‏తో జత కలిశారు. ఇప్పుడు వీరంత కలిసి చేసిన యాడ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఏ ఉత్పత్తులకు ప్రకటన చేశారు అనుకుంటున్నారు కదా. అదే మీషో యాడ్. ఈ ప్రకటనలో చరణ్, రష్మిక, గంగూలీ, రోహిత్ శర్మ సేల్స్ మ్యాన్స్‏గా మారారు. రండి రండి బట్టలు కొనండి అంటూ చరణ్ తన స్టైల్లో డైలాగ్స్ చెప్పేశాడు. ఇక రష్మిక, గంగూలీ సైతం నటన ఇరగదీశారు. గతంలో చరణ్.. బాలీవుడ్ బ్యూటీ అలీయాతో కలిసి ఫ్రూటీకి అంబాసిడర్‏గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీరంత కలిసి నటించిన మీషో యాడ్ నెట్టింట సందడి చేస్తుంది.

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ పవర్‏ఫుల్ లుక్‏లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే పలుమార్లు చెర్రీ ఫోటోస్ లీక్ అయ్యాయి కూడా. ఇక వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu