Katrina Kaif: మల్టీ కలర్‌ స్వెటర్‌లో మెరిసిపోయిన మల్లీశ్వరి.. ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

Katrina Kaif Sweater: కత్రినా కైఫ్‌.. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. విక్టరీ వెంకటేశ్‌ నటించిన మల్లీశ్వరి సినిమాలో ఆమె అందం, అభినయానికి టాలీవుడ్ ప్రేక్షకులు ముగ్ధులయ్యారు.

Katrina Kaif: మల్టీ కలర్‌ స్వెటర్‌లో మెరిసిపోయిన మల్లీశ్వరి.. ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే
Katrina Kaif
Follow us
Basha Shek

|

Updated on: Sep 06, 2022 | 2:03 PM

Katrina Kaif Sweater: కత్రినా కైఫ్‌.. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. విక్టరీ వెంకటేశ్‌ నటించిన మల్లీశ్వరి సినిమాలో ఆమె అందం, అభినయానికి టాలీవుడ్ ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. గతేడాది బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామర్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలతో పాటు వెకేషన్‌ పిక్స్‌ను అందులో షేర్‌ చేస్తుంటుంది. అలా తాజాగా ఈ సొగసరి చేసిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో మల్టీ కలర్‌ స్వెటర్‌తో పాటు డెనిమ్‌ జీన్స్‌లో ధరించి ఎంతో అందంగా కనిపించింది కత్రినా.

ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన క్యాట్‌.. మార్నింగ్ అనే క్యాప్షన్‌తో పాటు కాఫీ, ఫ్లవర్‌ ఎమోజీలను జత చేసింది. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ ఫొటోకు ఇప్పటికే 13.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా మల్లీశ్వరి ధరించిన స్వెటర్‌ నెటిజన్లను బాగా ఆకర్షించింది. కొందరు ఈ కలర్‌ఫుల్‌ స్వెటర్‌ ధరెంతో ఆరా తీయగా ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. 100 శాతం పాలిస్టర్‌తో తయారైన ఈ స్వెటర్ ధర సుమారు 445 డాలర్లు. అంటే ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ.35వేలు. దీంతో స్వెటర్‌ కోసం క్యాట్ అంత ఖర్చు చేసిందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ పోస్టు చూసిన నెటిజన్లు కత్రినాను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. ‘సో క్యూట్‌..ఏంజిల్‌’ అంటూ లవ్‌, హార్ట్‌ ఎమోజీలు షేర్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..