Renu Desai: జీవితంలో తోడు కావాలి.. సోల్‌మేట్‌.. హాట్‌ టాపిక్‌గా మారిన రేణు దేశాయ్‌ పోస్ట్‌లు

రేణు దేశాయ్‌.. నటిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా.. ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటిన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్‌ కల్యాణ్‌ నటించిన బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాలతార

Renu Desai: జీవితంలో తోడు కావాలి.. సోల్‌మేట్‌.. హాట్‌ టాపిక్‌గా మారిన రేణు దేశాయ్‌ పోస్ట్‌లు
Renu Desai
Follow us
Basha Shek

|

Updated on: Sep 05, 2022 | 1:51 PM

రేణు దేశాయ్‌.. నటిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా.. ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటిన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్‌ కల్యాణ్‌ నటించిన బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాలతార ఆ తర్వాత జానీ చిత్రంలో  నటించి మెప్పించింది. ఇదే సమయంలో పవన్‌తో ప్రేమలో పడి ఆయనతోనే పెళ్లిపీటలెక్కింది. వీరికి అకీరానందన్‌, ఆద్య అనే పిల్లలు పుట్టారు. కాగా 2012లో పవన్‌ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటుంది. అప్పుడప్పుడు బుల్లితెరపై సందడి చేస్తున్న ఆమె కొన్ని రియాలిటీ షోలు, డ్యాన్స్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. కాగా గతంలో రేణు దేశాయ్‌ రెండో పెళ్లిపై వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రెండో పెళ్లికి కూడా రెడీ అయిన రేణుకి 2018లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఎందుకో గానీ అతనితో పెళ్లిపై ముందుకు వెళ్లలేదు. అయితే తాజాగా రేణు దేశాయ్‌ చేసిన పోస్ట్‌ మరోసారి ఆమె రెండో పెళ్లిపై చర్చకు దారి తీశాయి. ‘జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చెయ్యి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి’.. అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్‌చేసింది. అనంతరం మరో పోస్ట్‌లో.. ‘మీ సోల్‌మేట్‌ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి’ అంటూ ఓ వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..