Watch Video: ఆస్ట్రేలియాలో కంగారూలతో తెగ ఎంజాయ్ చేసిన మంత్రి రోజా.. వీడియో చూస్తే..
Minister Roja: రిలీఫ్ కోసం ఆస్ట్రేలియా టూర్ వెళ్లారు. బల్లారట్ నేషనల్ పార్క్‌లో కంగారూలతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు అసోసియేషన్ల ఆహ్వానంతో వెళ్లిన రోజా.. కొద్దిసేపు..
పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా ఉండే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా.. కాస్త రిలీఫ్ కోసం ఆస్ట్రేలియా టూర్ వెళ్లారు. బల్లారట్ నేషనల్ పార్క్‌లో కంగారూలతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు అసోసియేషన్ల ఆహ్వానంతో వెళ్లిన రోజా.. కొద్దిసేపు ఆటవిడుపుగా కంగూరాలతో అటలాడారు.. ఆస్ట్రేలియా జాతీయ జంతువైన కంగారూతో పార్క్ లో ఉల్లాసంగా గడిపారు. మరోవైపు ఏపీ హోమంత్రి తానేటి వనిత అమెరికాలో గన్‌తో సందడి చేశారు. వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లిన హోంమంత్రి అక్కడ గన్ చేతపట్టారు. ఫైరింగ్ ట్రైనింగ్ క్యాంప్ లో గన్ పట్టుకుని ఎలాంటి ఫియర్ లేకుండా ఫైరింగ్ చేస్తుంటే అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు.
అమెరికాలో హోంమంత్రి గన్ చేత పడితే.. ఆస్ట్రేలియాలో పర్యాటక శాఖమంత్రి అక్కడి పర్యాటకాన్ని గుర్తు చేస్తూ కంగారూలతో సందడి చేశారు. వాటికి తినడానికి ఆహారాన్ని పెట్టారు. మొత్తానికి ఇద్దరు మంత్రులు విదేశాల్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా.. రిలాక్స్‌డ్‌గా కనిపించారు.
కాస్త రిలీఫ్ అవడం కాకుండా.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌లో ప్రవాసాంధ్రులతో పాటు స్థానిక వ్యాపార వేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ పర్యాటకులు, పెట్టుబడిదారులను ఆకర్షించేలా అపార పర్యాటక వనరులు ఉన్నాయన్నారు. దేశంలోనే ఉత్తమ పర్యాటక పాలసీని అమలు చేస్తున్నట్లుగా వివరించారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి.
ఇందులో ఆస్ట్రేలియాలోని క్వెస్ట్ సెక్యూరిటీ లిమిటెడ్ సంస్తకు చెందిన గ్రాంట్ రాబర్ట్‌సన్, ప్రవాసాంధ్రుడు బిఎస్ కాప్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ హరీష్ బిశం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. గ్రేస్ట్ రాబర్ట్‌సన్ మాట్లాడుతూ భారత్‌తో పాటు ఆంధ్రా ప్రభుత్వంతో దీర్ఘకాలిక సంబంధం కొనసాగించాలని కోరుకుంటున్నానన్నారు. హరీష్ బిశం మాట్లాడుతూ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నట్టు తెలిపారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం