Andhrapradesh: వైసీపీ వచ్చినా కలిసి పనిచేస్తాం.. బీజేపీ నేత టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు..
బీజేపీ నేత, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బలపడి అధికారంలోకి రావడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో పొత్తులపై ప్రధానంగా చర్చ జరుగుతోందని.. తమతో కలిసి వచ్చే ఏ పార్టీతో..
Andhrapradesh: బీజేపీ నేత, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బలపడి అధికారంలోకి రావడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో పొత్తులపై ప్రధానంగా చర్చ జరుగుతోందని.. తమతో కలిసి వచ్చే ఏ పార్టీతో అయినా తాము కలిసి పనిచేస్తామన్నారు. వైసీపీ వచ్చి మద్దతు ఇచ్చినా తాము తీసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఏపార్టీ మద్దతు ఇచ్చినా కలుపుకుని వెళ్తామన్నారు. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ కలయికపై కూడా టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరు కలిసినంత మాత్రన జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరుతున్నట్లు కాదన్నారు. రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతాయన్నారు. జూనియర్ ఎన్డీఆర్ పాత్ర ఏంటనేది త్వరలోనే తెలుస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ను కలిసినంత మాత్రన జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరుతున్నట్లు కాదన్నారు. బీజేపీ-జనసేన పొత్తుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసి ఎక్కువ స్థానాల్లో గెలిచి అధికారంలోకి రావాలని మాత్రమే తమ పార్టీ కోరుకుంటుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని టిజి.వెంకటేష్ తెలిపారు. ఈనెల 19వ తేదీ నుంచి జిల్లాల స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తాము వెంటపడటం లేదని.. తమకు మద్దతు ఇవ్వాలని తాము ఎవరిని అడగలేదన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చని టిజి.వెంకటేష్ చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..