Ganesh Chaturthi 2022: తిరుపతి బాలాజీ స్టైల్‌లో 18 అడుగుల ‘గోల్డెన్ గణేషుడు’.. నిమజ్జనం ఎలా ఉంటుందో మరీ..!
గణేశ చతుర్థి సందర్భంగా నిర్వహించే ఊరేగింపులు, విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు ఉత్తర్వులు, కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను పక్కాగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.
Ganesh Chaturthi 2022: అన్ని పండుగలలో కెల్లా అతి ముఖ్యమైన పండగ గణేష్ చతుర్ధి..దేశమంతా అత్యంత ఘనంగా జరుపుకునే వినాయక చవితి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31న నిర్వహించుకోనున్నారు భక్తులు. ఊరువాడ, ఇంటింట పదిరోజులపాటు వైభవంగా పూజలందుకుంటాడు గణనాధుడు..చివరిరోజున భారీ ఊరేగింపులతో వినాయక నిమజ్జనం ఉంటుంది. గణేశుని నిమజ్జనం ఈసారి సెప్టెంబర్ 9వ తేదీన జరగనుంది. ఇకపోతే, వినాయక చవితి పండగ కోసం యావత్ దేశం సన్నద్ధమవుతోంది. పండగ దగ్గరపడుతున్న క్రమంలో గణేషుడి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు భక్తులు అన్ని ఏర్పాట‍్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కో విధంగా, ఒక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు విఘ్నేశుడు. అయితే, ఈసారి స్వర్ణ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. గణేశ చతుర్థి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని చందౌసిలో 18 అడుగుల పొడవైన బంగారు గణేశ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.
18 అడుగుల విగ్రహానికి మొత్తం బంగారంతో వివిధ రకాల ఆకృతులను తాపడంగా చేస్తున్నట్లు చెప్పారు నిర్వాహకుడు అజయ్ ఆర్యా.‘గణేషుడి విగ్రహం 18 అడుగుల ఎత్తు ఉంటుంది. తిరుపతి బాలాజీ మాదిరిగా బంగారు ఆభరణాలను అలంకరిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఏర్పాటు వేగంగా జరుగుతున్నాయని, బంగారు గణేషుడి విగ్రహం వినాయక చవితి నాటికి పూర్తవుతుందని చెప్పారు అజయ్. బంగారంతో సిద్ధం చేస్తున్న 18 అడుగుల వినాయకుడి విగ్రహం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
#WATCH | ‘Swarna Ganesh’ adorned with gold is being made in UP’s Chandausi for Ganesh Chaturthi
“It will be an 18 feet tall idol. It is being prepared with gold decorative items on the lines of Tirupati Balaji,” says Ajay Arya, a person associated with the project pic.twitter.com/B5RH2eXTnh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 25, 2022
ఉత్తరప్రదేశ్‌లో 18 అడుగుల ఎత్తైన గోల్డెన్ గణనాధుడు ముస్తభవుతుంటే,..సింగపూర్‌లో 7000 కొబ్బరికాయలతో 21 అడుగుల ఎత్తైన కొబ్బరి గణపతిని నిర్మించారు. వినాయక చతుర్థి సందర్భంగా సింగపూర్‌లోని శివాలయంలో తొలిసారిగా 7000 కొబ్బరికాయలతో చేసిన పిల్లియార్ ఉత్తరుళిని ప్రతిష్టించారు.