AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అభయారణ్యంలో అరుదైన బ్లాక్ పాంథర్.. రోడ్‌ క్రాస్‌ చేస్తూ హల్‌చల్‌.. వైరలవుతున్న వీడియో

ఈ అరుదైన చిరుతను చూసిన పర్యాటకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్విటర్‌లో షేర్ చేసిన ఒక్క వీడియోకు ఇప్పటివరకు వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ప్రత్యక్ష సాక్షులే కాకుండా..

Viral Video: అభయారణ్యంలో అరుదైన బ్లాక్ పాంథర్.. రోడ్‌ క్రాస్‌ చేస్తూ హల్‌చల్‌.. వైరలవుతున్న వీడియో
Black Panther
Jyothi Gadda
|

Updated on: Aug 25, 2022 | 3:45 PM

Share

Viral Video: భారతదేశంలో పర్యాటకానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చారిత్రక ప్రదేశాలు, శిల్పాలు, కోటలు, రాజభవనాలు మొదలైన వాటిని చూసేందుకు ప్రతి నెలా లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అంతే కాకుండా వన్యప్రాణులతో కూడిన జాతీయ పార్కులు కూడా ఉన్నాయి. ఈ పార్కులో చాలా అరుదైన జంతువులు ఉన్నాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇటీవల టూర్‌కి వెళ్లిన పర్యాటకులు గతంలో ఎన్నాడూ చూడలేని అనుభూతిని పొందారు.

బెంచ్ టైగర్ అభయారణ్యంలో పర్యాటకులు బ్లాక్ పాంథర్‌లను చూశారు. నెలలు, ఏళ్లుగా ఇలాంటి వాటిని చూడాలని ప్రయత్నిస్తున్న వారిలో ఇటీవల కొందరు పర్యాటకులకు ఈ అవకాశం దక్కింది. వీడియోలో, కొన్ని వాహనాలలో పర్యాటకులు అడవుల్లోకి వెళ్లారు. ఆ సమయంలో వారు సందర్శిస్తున్న ప్రాంతంలో ఒక నల్ల చిరుతపులి రోడ్డు దాటుతూ కనిపించింది.

ఇవి కూడా చదవండి

చిరుతను చూసిన పర్యాటకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్విటర్‌లో షేర్ చేసిన ఒక్క వీడియోకు ఇప్పటివరకు 19 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రత్యక్ష సాక్షులే కాకుండా ట్విట్టర్‌లో చూసిన నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్ల చిరుతపులిని చూసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ అవకాశం కోసం చాలాసార్లు ప్రయత్నించాం..కానీ, లైవ్‌లో చూడలేక పోయాం అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో కనిపించిన దృశ్యాలు చూసి ఆనందంగా ఉందంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి