AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వింతల్లోనే వింత.. చేతిపంపులోంచి ఏమి వచ్చాయో చూస్తే మైండ్ బ్లాంక్..

ఛతర్ పూర్ లోని బక్స్ హహా తాలుకా కాచర్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఓ వింత ఘటన జరిగింది. గ్రామంలోని ఓ చేతి పంపు నుంచి నీరు, మంటలు ఒకేసారి రావడంతో ఆప్రాంత ప్రజలంతా భయాందోళన చెందారు. ఈవింతను చూసేందుకు గ్రామంలోని ప్రజలంతా ఆ చేతి పంపు చుట్టూ..

Viral Video: వింతల్లోనే వింత.. చేతిపంపులోంచి ఏమి వచ్చాయో చూస్తే మైండ్ బ్లాంక్..
Fire In Pump
Amarnadh Daneti
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 25, 2022 | 6:40 PM

Share

Viral News: దాహం వేస్తే వెంటనే ఎక్కడైనా పంపు కనపడితే నీళ్లు తాగి దాహం తీర్చుకోవాలనుకుంటాం. మనమంతా ఏదో ఒక సమయంలో చేతి పంపు నీరు తాగే ఉంటాం. కాని చేతి పంపులోంచి నీరు కాకుండా ఇంకేదైనా వస్తే వెంటనే షాకవుతాం. అదే పంపులోంచి మంటలు, నీరు కలిపి వస్తే.. అబ్బే అలా ఎప్పటికి జరగదు.. నీటి పంపులోంచి మంటలెలా వస్తాయి.. వచ్చినా మంటలను ఆపే శక్తి నీటికుంటుంది కదా.. అనుకుంటాం.. ఒక వేళ మంటలు, నీళ్లు కలిపి వస్తే బాబోయ్ అంటూ నాలుగు అడుగులు వెనక్కి పరిగెడతాం. నిజమే ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లాలో జరిగింది. ఏంటి ఇప్పటికి నమ్మబుద్ది కావడం లేదా.. అయితే రీడ్ దిస్ స్టోరీ..

ఛతర్ పూర్ లోని బక్స్ హహా తాలుకా కాచర్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఓ వింత ఘటన జరిగింది. గ్రామంలోని ఓ చేతి పంపు నుంచి నీరు, మంటలు ఒకేసారి రావడంతో ఆప్రాంత ప్రజలంతా భయాందోళన చెందారు. ఈవింతను చూసేందుకు గ్రామంలోని ప్రజలంతా ఆ చేతి పంపు చుట్టూ గుమిగూడారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన గ్రామంలో జరగలేదని స్థానికులు అంటున్నారు. ఈఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఏదైనా కాలినప్పుడు లేదా మంటలను వ్యాపించే పదార్థం ఆప్రదేశంలో ఉన్నా కేవలం మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాని.. నీరు, మంటలు కలిపి ఒకేసారి రావడంతో ఆప్రాంత ప్రజలంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈఘటనపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులకు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చేతి పంపు నుంచి ఒకేసారి మంటలు, నీరు రావడం ఈప్రాంతంలో మొదటిసారి చూస్తున్నామని, పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈఘటనకు గల కారణాలు తెలిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఛతర్ పూర్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాచర్ గ్రామంలో కొందరు వ్యక్తులు వాకింగ్ కు వెళ్లినప్పుడు చేతి పంపు నుంచి మంటలు రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే వారు ఈవిషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. చేతి పంపు దగ్గరకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈఘటన ఓ అద్భుతమని గ్రామంలో కొందరు అంటుంటే.. ఏదైనా రసాయనాలు పంపులో కలిసి ఉండొచ్చని.. అందుకే ఈమంటలు వ్యాపించాయని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. చేతి పంపులోంచి మంటలు రావడాన్ని చూసిన వారంతా ఈదృశ్యాలను మొబైల్ లో బంధించి రికార్డు చేశారు. వీటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈవింత సంఘటన ప్రపంచమంతా పాకింది. వాస్తవానికి నీటి ఎద్దడితో ఈగ్రామ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈసమయంలో ఈచేతి పంపు నుంచి మంటలు రావడంపై మరింత ఆందోళన చెందుతున్నారు ఇక్కడి ప్రజలు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..