Viral Video: ఇదొ విచిత్ర జూ .. బోనులో మనుషులను చూసేందుకు వచ్చే అడవి జంతువులు.. ఎక్కడంటే..
వైల్డ్‌లైఫ్ జూలో జంతువులను స్వేచ్ఛగా సంచరించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ జూలో మనుషుల్ని బోనులో బంధించిపెడతారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులు వాటిని వెంబడిస్తున్నప్పుడు సందర్శకులు ప్రత్యక్షం చూసే అవకాశం ఉంటుంది.
Viral News: సింహాలు, పులులు వంటి శక్తివంతమైన, క్రూరమైన అడవి జంతువులను బోనులలో బంధించడం మనం తరచూ చూస్తుంటాం.. ప్రజల వినోదం కోసం వాటిని జూలలో బంధించి ప్రదర్శనలో ఉంచడం కొన్ని కొన్ని సందర్బాల్లో చాలా బాధగా కూడా ఉంటుంది. అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఈ జంతువులు వాటి సహజ ఆవాసాల నుండి తరలించి బందిఖానాలో పెడుతున్నారు. అయితే, చైనాలో ఒక ప్రత్యేకమైన జంతుప్రదర్శనశాల ఉంది. ఇక్కడ జంతువులు కాదు, మనుషుల్ని బోనులలో బంధిస్తారు. సింహాలు, పులులు వంటి క్రూర మృగాలు మనుషుల్ని చూసి విచిత్రపోతుంటాయి.. పూర్తి వివరాల్లోకి వెళితే…
చైనాలోని చాంగ్‌కింగ్ నగరంలోని లెహె లేడు వైల్డ్‌లైఫ్ జూలో జంతువులను స్వేచ్ఛగా సంచరించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ జూలో మనుషుల్ని బోనులో బంధించిపెడతారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులు వాటిని వెంబడిస్తున్నప్పుడు సందర్శకులు ప్రత్యక్షం చూసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక టికెట్ కూడా ఉంటుంది. ఇంకా మనుషులు బంధించబడి ఉన్న ట్రక్కు బార్‌లకు పచ్చి మాంసం ముద్దలను కట్టిపెడతారు. దాంతో అలాంటి జంతువులను సందర్శకులు మరింత దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. ఆహారంపై ఆశతో జంతువులు మనుషులున్న బోను దగ్గరకు వస్తాయి. కొన్నిసార్లు అవి మనుషుల్ని బంధించిపెట్టిన బోనుపైకి కూడా ఎక్కేస్తుంటాయి.
This is a human zoo where the animals can see the dangerous humans in the cages?
— Tansu YEĞEN (@TansuYegen) August 22, 2022
ఈ వీడియోను Tansu YEĞEN ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి..క్యాప్షన్‌గా”ఇది మానవ జంతుప్రదర్శనశాల, ఇక్కడ జంతువులు బోనులలో ఉన్న ప్రమాదకరమైన మానవులను చూడగలవు” అని శీర్షిక పెట్టారు.
ఇక, ఈ క్లిప్ 827K కంటే ఎక్కువ వీక్షణలను,5000 కంటే ఎక్కువ రీట్వీట్‌లను పొందింది. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, “ప్రతిచోటా ఇలాగే ఉండాలి. జంతువులనే ఎందుకు బంధించాలంటున్నారు.? అయితే ఇది అతి పెద్ద జూ అంటున్నారు కొందరు నెటిజన్లు. చాలా మంది నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి