Andra Pradesh: వికటించిన ప్రేమ.. మనస్తాపంతో ఆర్మీ జవాను ఆత్మహత్య.. పోలీస్ స్టేషన్ ముట్టడించిన గ్రామస్థులు

ప్రేమించిన యువతి పారిపోయి తన దగ్గరకు వస్తే ఇది తప్పు అని చెప్పి తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించడమే అతను చేసిన పాపం అయింది... ఫలితంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆర్మీ జవాను అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.

Andra Pradesh: వికటించిన ప్రేమ.. మనస్తాపంతో ఆర్మీ జవాను ఆత్మహత్య.. పోలీస్ స్టేషన్ ముట్టడించిన గ్రామస్థులు
crime news
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 23, 2022 | 5:11 PM

Chinnaganjam: ప్రేమించడమే ఆ ఆర్మీ జాను చేసిన నేరం అయింది… ప్రేమించిన యువతి పారిపోయి తన దగ్గరకు వస్తే ఇది తప్పు అని చెప్పి తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించడమే అతను చేసిన పాపం అయింది… ఫలితంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆర్మీ జవాను అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది… తను ప్రేమించిన యువతి తోనే ఆమె తల్లిదండ్రులు వేధింపుల కేసు నమోదు చేయించడంతో పాటు, పోలీసులు ఫోన్లు చేసి బెదిరించారన్న మనస్తాపంతో తాను ఉద్యోగం చేస్తున్న జమ్మూలోని ఆర్మీ క్వార్టర్స్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ జవాను… దీంతో అతని స్వగ్రామం మూలగానిపల్లి లో విషాద ఛాయలు అలుముకున్నాయి… ఆర్మీ జవాన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ జాతీయ జెండాలు పట్టుకుని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు… యువతి తల్లిదండ్రులతో పాటు జవాన్‌ను బెదిరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని మూలగానివారిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి… నిన్నమెన్నటి వరకు స్నేహితులతో సరదాగా గడిపి నూతనంగా ఇల్లు నిర్మించుకునెందుకు శంకుస్థాపన చేసి దేశ సేవకై జమ్ము కాశ్మీర్ వెళ్లిన సూర్యప్రకాష్ రెడ్డి మరణ వార్తతో మూలగానివారిపాలెం గ్రామం శోక సముద్రం లో మునిగింది ..ఈ నెల 6 వరకు కుటుంబసభ్యులు, స్నేహితులతో సరదా గడిపి మరలా సెలవులకు తిరిగి వస్తానని వెళ్లిన సూర్యప్రకాష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న సమాచారం గ్రామస్తులను తీవ్ర దుంఖంలో ముంచేసింది. జమ్మూ ఆర్మీలో నాయర్ గా పనిచేస్తున్న సూర్యప్రకాష్ రెడ్డి గ్రామానికి చెందిన యువతితో సన్నిహితంగా మెలగుతూ వచ్చాడు. ఇరువురు వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈవిషయం అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చలేదు. సూర్యప్రకాష్ రెడ్డి జమ్మూకి తిరిగి వెళ్లిన అనంతరం ఈనెల 7 వ తేదీన అతనిపై అమ్మాయి తండ్రి అమ్మాయితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు నమోదు చేయించాడు. దీంతో ఇంకొల్లు సి ఐ, రంగనాధ్, అమ్మాయి తండ్రి విజయభాస్కర్ రెడ్డి, అమ్మాయి బంధువులు సూర్యప్రకాష్ రెడ్డికి ఫోన్ చేసి మీకుటుంబ సబ్యులను చంపేస్తామని, లేదంటే మీరు అక్కడే చావాలనీ పదేపదే బెదిరించినట్లు బంధువులు తెలిపారు. పోలీస్ స్టేషన్ కి రాకపోతే ఉద్యోగం పీకేస్తానంటూ పోలీసులు బెదిరించటంతో మనస్థాపానికి గురైన సూర్యప్రకాష్ రెడ్డి జమ్మూలోని తన క్వార్టర్స్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునట్లు తెలిపారు.

దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు చిన్నగంజాం పోలీసు స్టేషన్ ను ముట్టడించారు. జాతీయ జెండాలు పట్టుకొని పిల్లలు, పెద్దలు ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు వచ్చారు… ఆర్మీ జవాన్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు… సూర్యప్రకాష్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంత్యక్రియల సమయంలో సూర్యప్రకాష్ రెడ్డి మృతదేహాన్ని కదిలించే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి