CM Jagan: స్పంద‌నపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌.. సగటు వేతనం రూ.240 ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్

ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న ఆయన.. పూర్తి కాని ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్‌ క్లినిక్స్‌ను అక్టోబర్‌ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు.

CM Jagan: స్పంద‌నపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌.. సగటు వేతనం రూ.240 ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్
Cm Jagan
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 23, 2022 | 5:31 PM

స్పంద‌నపై కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందులో పలు అంశాలపై సూచనలు చేశారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా.. వివిధ అంశాలపై కీలక సూచనలు చేశారు..  విద్య, వైద్యంలో నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించనున్నారాయన. అలాగే వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్‌తో పాటు జగనన్న గృహనిర్మాణ పథకం, ఇళ్ళ పట్టల పంపిణీపైనా సమీక్ష నిర్వహిస్తారు. టిడ్కో ఇళ్లపై దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్‌.. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష సర్వే పైనా సమీక్ష నిర్వహిస్తారు. అదే విధంగా స్పందన కార్యక్రమంలో వస్తున్న పిర్యాదులు పరిష్కారం.. పురోగతి పైనా ఆయన సమీక్ష చేపట్టనున్నారు.

ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న ఆయన.. పూర్తి కాని ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్‌ క్లినిక్స్‌ను అక్టోబర్‌ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ఇక‌పై ప్రతిరోజూ స్పంద‌న కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మధ్యహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా స్పంద‌న కాన్షరెన్స్ ఉంటుంది. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్‌ వారిగా సమీక్ష ఉంటుంది. మండల స్థాయిలో అధికారులు ఖచ్చితంగా పాల్గొనాలని అన్నారు. ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలన్నారు.

ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్‌ క్లినిక్స్‌ను అక్టోబరుకు పూర్తిచేయాలని ఆదేశించారు సీఎం జగన్. 3,966 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు డిసెంబరు నాటికి పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్వహణపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలన్నారు.

ఇవి కూడా చదవండి

ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్‌ నంబర్లతో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వృద్ధిరేటులో ఏపీ టాప్‌గా నిలవడం సంతోషకరంగా ఉందన్నారు. 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు.. 11.43 శాతంగా నిలవడం సంతోషకరమన్నారు. దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉందన్నారు సీఎం జగన్.

మరిన్ని ఏపీ వార్తల కోసం

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..