Health: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారం.. ప్రతి రోజూ వీటిని తింటే మీ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!!

ఇది కణాల పెరుగుదలకు చాలా ముఖ్యమైనది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

Health: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారం.. ప్రతి రోజూ వీటిని తింటే మీ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!!
Diabetes
Follow us

|

Updated on: Aug 25, 2022 | 5:12 PM

Health News: మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి ఉత్తమమైన ఆహారంగా చెబుతున్నారు. వీటితో మీ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, డ్రై ఫ్రూట్స్ తినడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అవును.. కొన్ని రకాల డ్రైఫ్రూట్స్‌..మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తాయి. వాటిని తీసుకోవడం ద్వారా, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది ఇతర ఆహారాల కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి డ్రైఫ్రూట్స్‌ తినాలో ఇక్కడ తెలుసుకుందాం. డయాబెటిక్ పేషెంట్లు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.. బాదంపప్పు.. బాదంపప్పులు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు . బాదంలోని పోషకాలు రక్తంలో చక్కెరను నియంత్రించడం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తాయి. దీని కారణంగా ధమనులలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

వాల్‌నట్‌లు.. వాల్‌నట్స్‌లో మంచి క్యాలరీలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటిక్ రోగుల బరువు కూడా అదుపులో ఉంటుంది. దీని వల్ల మీ జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీ ఎముకలు దృఢంగా ఉంటాయి.

వేరుశెనగ.. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుశెనగ తినడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కణాల పెరుగుదలకు చాలా ముఖ్యమైనది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుశెనగ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పిస్తా పిస్తాపప్పు.. పిస్తాపప్పు తినడం వల్ల శరీరానికి పుష్కలంగా శక్తి లభిస్తుంది. ఇందులో ఫైబర్, కొవ్వు, ఒమేగా వంటి అంశాలు ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది. పిస్తాపప్పు తినడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది గుండె సమస్యలను తొలగిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ డ్రై ఫ్రూట్స్ తినకూడదు.. ఖర్జూరం.. ఖర్జూరాల్లో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిల ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖర్జూరాలను తినకూడదు. ద్రాక్ష.. ద్రాక్షలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలో గ్లూకోజ్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ద్రాక్షను తినకూడదు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ