AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యా బాబోయ్‌… ఒకేసారి ఒకే వ్యక్తిలో Monkeypox, HIV, Covid-19..! ఇప్పుడెలా ఉందంటే..?

బాధితుడికి వైరస్ సోకి 20 రోజులైనా మంకీపాక్స్ ఓరోఫారింజియల్ స్వాబ్ పాజిటివ్‌గా ఉందని వారు వెల్లడించారు. ఓ వ్యక్తికి మూడు వైరస్‌లు సోకితే అతడి పరిస్థితి ఆందోళనకరంగా..

అయ్యా బాబోయ్‌... ఒకేసారి ఒకే వ్యక్తిలో Monkeypox, HIV, Covid-19..! ఇప్పుడెలా ఉందంటే..?
Coronavirus New Variant
Jyothi Gadda
|

Updated on: Aug 25, 2022 | 7:13 PM

Share

Monkeypox: కరోనా మహమ్మారి విజృంభణ కాస్త తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే.. అనేక రూపాల్లో విజృంభిస్తున్న వైరస్‌ ప్రజల్ని వణికిస్తోంది. మంకీ పాక్స్, టమాటో ఫ్లూ అంటూ కొత్త రూపాంతరాలు హడలెత్తిస్తున్నాయి. రోజుకో కొత్త కొత్త వైరస్‌ లు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి. అయితే ఒకటి తగ్గిన తర్వాత మరొకటి తమ ప్రతాపం చూపిస్తున్నాయి. కానీ ఇటలీలో ఓ వ్యక్తికి ఒకేసారి మూడు వైరస్‌ లు ఎటాక్ అయ్యాయి. అతనికి ఒకేసారి కరోనా, మంకీపాక్స్‌తో పాటు హెచ్‌ఐవీ నిర్ధారణ అయ్యింది. ఈ ఘటన యావత్‌ ప్రపంచాన్నే విస్తూ పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే..

ఇటలీలో 36 ఏళ్ల వ్యక్తిలో మొదటిసారిగా మంకీపాక్స్, కోవిడ్-19,హెచ్‌ఐవి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం , రోగి పేరు వెల్లడించలేదు..సదరు వ్యక్తి ఐదు రోజుల స్పెయిన్‌ పర్యటన అనంతరం అతడు తిరిగి వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత జ్వరం, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, గజ్జ ప్రాంతంలో వాపుతో బాధపడ్డాడు. లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతడి ముఖం, ఇతర శరీర భాగాలపై తీవ్రమైన దద్దుర్లు కూడా కనిపించాయ. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆ వ్యక్తి వెంటనే ఆస్పత్రి ఎమర్జెన్సీలో చేరాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు..అతన్ని ఇన్ఫెక్షియస్ డిసీజ్ యూనిట్‌కి మార్చారు.

వర్సిటీలో చేసిన టెస్టుల్లో అతడికి మంకీపాక్స్‌ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం బాధితుడికి ఎస్‌టీఐ పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతడికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. సీడీ4 స్థాయిలను బట్టి సాపేక్షంగా హెచ్‌ఐవీ సంక్రమించినట్లు తాము భావిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు ఒక వారం తర్వాత ఆ వ్యక్తి ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అతను COVID-19, మంకీపాక్స్ నుండి కోలుకున్నాడు. అయినప్పటికీ చిన్న మచ్చ మిగిలి ఉంది. అతని HIV సంక్రమణకు చికిత్స ప్రారంభించబడింది. మంకీపాక్స్, కరోనా లక్షణాలు ఒకేసారి ఎలా వ్యాప్తి చెందుతాయో ఈ కేసును బట్టి తెలుస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ కాటానియా స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

కో-ఇన్ఫెక్షన్, అనామ్నెస్టిక్ సేకరణ, లైంగిక అలవాట్లు సరైన రోగ నిర్ధారణ చేయడానికి ఉపయోగపడతాయని తెలిపింది. బాధితుడికి వైరస్ సోకి 20 రోజులైనా మంకీపాక్స్ ఓరోఫారింజియల్ స్వాబ్ పాజిటివ్‌గా ఉందని వారు వెల్లడించారు. ఓ వ్యక్తికి మూడు వైరస్‌లు సోకితే అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందన్న దానికి తగినంత ఆధారాలు లేవని యూనివర్సిటీ ఆఫ్‌ కాటానియా తేల్చి చెప్పింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి