AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కడుపులో వికారం, వాంతులతో ఆస్పత్రికి వచ్చిన 9 ఏళ్ల బాలిక.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్

ఈ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే పిల్లల ఆరోగ్యంపై, మానసిక ప్రవర్తనపై దృష్టి పెట్టాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

Viral: కడుపులో వికారం, వాంతులతో ఆస్పత్రికి వచ్చిన 9 ఏళ్ల బాలిక.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
Hairball In Stomach (representative image)
Ram Naramaneni
|

Updated on: Aug 25, 2022 | 8:39 PM

Share

Trending: తూర్పు చైనా(eastern China)లోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుకియాన్‌లో ఓ వింత కేసు వెలుగుచూసింది. తొమ్మిదేళ్ల బాలికన వికారం,  వాంతులు వంటి లక్షణాలతో స్థానిక ఆస్పత్రికి వచ్చింది. దీంతో వెంటనే అన్ని రకాలు టెస్టులు చేశారు డాక్టర్లు.  గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ జావో చెంగ్‌గువాంగ్ ఈ కేసును డీల్ చేశారు. టెస్టుల రిపోర్టులు పరిశీలించిన అనంతరం బాలిక కడుపులో దాదాపు 1 కిలోల బరువున్న హెయిర్‌బాల్‌ను కనుగొన్నారు. కడుపు లోపల ఆహారం, గ్యాస్ట్రిక్ యాసిడ్స్‌తో హెయిర్ బాల్ అతుక్కుపోయింది ఆయన తెలిపారు. దీంతో వెంటనే ఆపరేషన్‌కు సిద్దం చేశారు. బాలిక వయస్సు చాలా తక్కువ. దీంతో ఇరుకైన అన్నవాహిక కారణంగా వైద్యులు 10 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుని ఆ హెయిర్‌బాల్‌ను తొలగించారు. బాలిక మానసిక సమస్యతో బాధ పడుతుందని అందుకే ఆమె జట్టును తిన్నదని  వైద్యులు తెలిపారు. మళ్లీ ఇలా జరగకుండా ఉండేందకు  ఆమెకు మానసిక చికిత్స అందించడం మంచిదని వైద్యులు పాప తల్లిదండ్రులకు సూచించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. తల్లిదండ్రులు అమ్మాయి మానసిక వ్యాధిని త్వరగా కనుగొనలేదని.. వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. పిల్లలకు తగిన సంరక్షణ, శ్రద్ధను అందించడంతో పాటు, తల్లిదండ్రులు వారి ప్రవర్తనపై, ఆరోగ్య సంబంధిత అంశాలపై కూడా కాస్త ధ్యాస పెట్టాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. (Source)

Hairball

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి