AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News:100ఏళ్ల వృద్ధురాలి వింత కోరిక.. విన్న వెంటనే అరెస్ట్‌ చేసిన పోలీసులు..? ఏమైందంటే..

ఇదంతా ఎందుకు చేస్తున్నారని అక్కడి ప్రజలు పోలీసులను ప్రశ్నించగా, పోలీసులు చాలా గౌరవంగా ఆ మహిళకు సంకెళ్లు వేసి అధికారికంగా అరెస్టు చేశారు.

Viral News:100ఏళ్ల వృద్ధురాలి వింత కోరిక.. విన్న వెంటనే అరెస్ట్‌ చేసిన పోలీసులు..? ఏమైందంటే..
Weird News
Jyothi Gadda
|

Updated on: Aug 25, 2022 | 5:45 PM

Share

Viral News: మీరు కొన్ని వింత కోరికల గురించి వినే ఉంటారు. అనుకున్నది సాధించేందుకు కొందరు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడతారు. అయితే, అలాంటి ఓ వింత కోరిక కోరిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, ఇది ఎలాంటి కోరికో మరీ..? వింటే మీరు కూడా షాక్‌ అవుతారు. ఆస్ట్రేలియాలో ఒక మహిళ తన 100వ పుట్టినరోజు సందర్భంగా ఒక విచిత్రమైన కారణంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తన పుట్టినరోజును ఓ నాటకీయ విధానంలో జరుపుకున్నారు. అందులో భాగంగానే పోలీసు అధికారులు వేడుకలను అడ్డుకున్నారు.ఆమెను అరెస్టు చేశారు.. దాంతో ఆ మహిళ కోరికను నెరవేర్చారు. విక్టోరియాలోని పోలీసులు అరెస్టు గురించి తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.ఆ వృద్ధ మహిళ కోరికను నెరవేర్చడానికి పోలీసులు ఆమెకు సహాయం చేశామని చెప్పారు.

కొందరికి ప్రపంచాన్ని చుట్టేయాలనే ఉంటుంది. కొందరికి ఒళ్లంతా పచ్చబొట్టు వేయించుకోవాలనేది కోరిక. ఇంకొందరికీ ఆధ్యాత్మిక యాత్రలు చేయాలని ఉంటుంది. కానీ, ఆస్ట్రేలియాకు చెందిన జీన్ బికెంటన్ అనే మహిళ కల మాత్రం కచ్చితంగా విచిత్రమైనదనే చెప్పాలి. ఎందుకుంటే.. ఆమె తన 100వ పుట్టినరోజు సందర్భంగా తనను తాను అరెస్టు చేయాలని కోరింది. పోలీసులు ఆమె కోరికను నెరవేర్చడానికి చాలా ప్రేమ, గౌరవంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ వింత ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Weird Newss

జీన్ బికెంటన్‌ చాలా సంవత్సరాలు ఆర్మీ నర్సుగా పనిచేశారు. ఆమె తన జీవితంలో ఒక్కసారి కూడా అరెస్టు కాలేదు. ఈ కలను సాకారం చేసుకోవడానికి, తనను తాను అరెస్టు చేయాలనే కోరికను వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను వివరిస్తూ విక్టోరియా పోలీసులు ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదంతా ఎందుకు చేస్తున్నారని అక్కడి ప్రజలు పోలీసులను ప్రశ్నించగా, పోలీసులు చాలా గౌరవంగా ఆ మహిళకు సంకెళ్లు వేసి అధికారికంగా అరెస్టు చేశారు. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, జీన్ బికెంటన్‌ తన అద్భుతమైన పుట్టినరోజు పార్టీలలో ఇదొకటి అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి