Ganesh Immersion: గణేషుడి ఊరేగింపులో వైసీపీ నాయకుల బంపర్ ఆఫర్.. ఏకంగా మద్యం డ్రమ్ములు పెట్టి మరీ..
Ganesh Immersion: వినాయక చవితిని ఎంత భక్తి ప్రపత్తులతో నిర్వహించుకుంటామో అందరికీ తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు స్వామి వారికి పూజలు చేసి..
Ganesh Immersion: వినాయక చవితిని ఎంత భక్తి ప్రపత్తులతో నిర్వహించుకుంటామో అందరికీ తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు స్వామి వారికి పూజలు చేసి, ప్రసాదాలు పెట్టి ఆయన ఆశీర్వాదం పొందాలని చూస్తాం. ఇక తొమ్మిది రోజులు పూర్తయిన తరువాత నిమజ్జనం రోజు మాత్రం సీన్ వేరు ఉంటుంది. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా చాలా మంది మద్యం సేవించి చిందులు వేస్తారు. దీన్నే క్యాష్ చేసుకునేందుకు రాజకీయ నాయకులు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి గేటు సెంటర్ వద్ద వినాయకుని ఊరేగింపు సందర్భంగా మందుబాబులకు వైసీపీ నాయకులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వినాయకుని ఊరేగింపులో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. ట్రాక్టర్ మీద డ్రమ్ము ఏర్పాటు చేసి మద్యం పంపిణీ చేశారు నాయకులు. సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలోనే బహిరంగంగా మద్యం పంపిణీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అందులోనూ పోలీసుల సమక్షంలోనే ఈ తతంగం నడవడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.