Sai Pallavi: ‘అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా’.. సాయి పల్లవి ఫోటోస్ చూస్తే ఈ మాట అనాల్సిందే..

తాజాగా తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది సాయి పల్లవి. తన ఫ్యామిలీతో కలిసి ఉన్న మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

Sai Pallavi: 'అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా'.. సాయి పల్లవి ఫోటోస్ చూస్తే ఈ మాట అనాల్సిందే..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2022 | 3:32 PM

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి (Sai Pallavi) యూత్‏లో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షోలకు దూరంగా నటనకు.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ప్రేమమ్ సినిమాతో కెరీర్ ఆరంభించిన ఈ అమ్మడు.. ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. తన యాటిట్యూడ్‏తో లేడీ పవర్ స్టార్‏గా పేరు తెచ్చుకుంది. ఇటీవలే విరాటపర్వం, గార్గి సినిమాలతో ఆడియన్స్ ను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఫ్యామిలీతో తన ఖాళీ సమయాన్ని గడిపేస్తుంది. తాజాగా తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది సాయి పల్లవి. తన ఫ్యామిలీతో కలిసి ఉన్న మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

అందులో సాయి పల్లవి కుటుంబం ఎంతో సంతోషంగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. తన చెల్లితో కలిసి అరచేతులకు గోరింటాకు పెట్టుకుని అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీరో పర్సెంట్ ఎక్స్ పోజింగ్.. జీరో పర్సెంట్ మేకప్.. సంప్రదాయబద్దంగా దుస్తులు.. అయినా అందంగా కనిపిస్తుంది. మనసుకు నచ్చిన పాత్రలు చేస్తూ..హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తూ.. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్న సాయి పల్లవిని చూస్తే ఎవరైనా అనేస్తారు. లైఫ్ అంటే ఇట్టా ఉండాలని. ఇక ఇదిలా ఉంటే.. సాయి పల్లవి నుంచి తన తదుపరి ప్రాజెక్ట్స్ అప్డేట్స్ ఇంకా ప్రకటించలేదు. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2లో సాయి పల్లవి అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.