Andra Pradesh: పోలీస్ స్టేషన్‌లో యువకుడి వీరంగం.. మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తిస్తూ..!
కంప్లైంట్ చేయడానికి వెళ్లిన వ్యక్తి ఆ పని మానేసి విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించాడు.. నీకు రూల్స్ తెలుసా, మీడియాను పిలుస్తానంటూ రివర్స్‌లో..
Andra Pradesh: పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు..కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లి మహిళా కానిస్టేబుల్‌తోనే దురుసుగా ప్రవర్తించాడు..అంతేకాదు…. నీకు రూల్స్ తెలుసా అంటూ రివర్స్‌లో ఆమెపై దౌర్జన్యానికి దిగాడు..ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది. ఉదయాన్నే కోటిరెడ్డి అనే వ్యక్తి సచివాలయానికి వెళ్లాడు..ఉన్నట్టుండి అక్కడి కంప్యూటర్, ప్రింటర్ ధ్వంసం చేశాడు..అడ్డువచ్చిన సిబ్బందిపై దాడి చేశాడు..అంతటితో ఆగని ఆ వ్యక్తి..రివర్స్‌లో సచివాలయం సిబ్బందిపైనే ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాడు.
అయితే, అక్కడ కూడా తన టెంపర్‌ను ప్రదర్శించాడు.. కంప్లైంట్ చేయడానికి వెళ్లిన వ్యక్తి ఆ పని మానేసి విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించాడు.. నీకు రూల్స్ తెలుసా, మీడియాను పిలుస్తానంటూ రివర్స్‌లో ఆమెతో గొడవకు దిగాడు..వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. సదరు యువకుడి తల్లి స్థానిక వార్డు మెంబర్‌గా తెలుస్తోంది..మరీ ఆ యువకుడు ఎందుకు దాడి చేశాడనేది ఇంకా క్లారిటీ రాలేదు..అయితే, కోటిరెడ్డి వీరంగం మాత్రం జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి