Mahesh Babu vs Thalapathy Vijay: స్టార్ హీరోల ఫ్యాన్స్ ట్విట్టర్ వార్.. రీజన్ ఏంటంటే

గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఇయర్‌ మహేష్‌ బర్త్ డే నుంచి కొత్త కొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అవి సోషల్‌ మీడియాలో రకరకాలుగా పోట్రే అవుతున్నాయి.

Mahesh Babu vs Thalapathy Vijay: స్టార్ హీరోల ఫ్యాన్స్ ట్విట్టర్ వార్.. రీజన్ ఏంటంటే
Mahesh Babu Vs Thalapathy V
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 07, 2022 | 1:16 PM

గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఇయర్‌ మహేష్‌(Mahesh Babu )బర్త్ డే నుంచి కొత్త కొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అవి సోషల్‌ మీడియాలో రకరకాలుగా పోట్రే అవుతున్నాయి. లేటెస్ట్ గా మహేష్, విజయ్‌ ఫ్యాన్స్ మధ్య సోషల్‌ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్‌ వార్‌ జరుగుతోంది. ఇంతకీ దీనికి రీజనేంటి అనుకుంటున్నారా..? మహేష్ బర్త్ డే సందర్భంగా పోకిరి, ఒక్కడు సినిమాలను థియేటర్స్ లో రీ రిలీజ్‌ చేశారు. ఈ రెండు సినిమాలకు వరల్డ్ వైడ్‌ అనూహ్యమైన స్పందన వచ్చింది. స్టార్‌ హీరోల హిట్ సినిమాల రీరిలీజ్‌లు ఎంత ప్రెస్టీజియస్‌గా చేయొచ్చో మరోసారి జనాలకు తెలిసొచ్చింది. మహేష్ సినిమాలకు వచ్చిన కలెక్షన్లను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు ఫ్యాన్స్. అంతే కాదు, మహేష్‌ నటించిన పోకిరి, ఒక్కడు సినిమాలను తమిళంలో విజయ్‌ చేశారు. పోకిరి అదే పేరుతో రీమేక్‌ కాగా, ఒక్కడు గిల్లి పేరుతో రీమేక్‌ అయి సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది.

ఆ విషయాలను ప్రస్తావిస్తూ మహేష్‌ ఫ్యాన్స్.. ‘నేషనల్‌ ట్రోల్‌ మెటీరియల్‌ విజయ్‌’ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ క్రియేట్‌ చేశారు. అటు విజయ్‌ ఫ్యాన్స్ ఈ ట్రోల్‌ని తిప్పికొట్టేలా కొన్ని హ్యాష్‌ ట్యాగ్స్ ని ప్రమోట్‌ చేశారు. ట్విట్టర్‌లో ఈ ఫ్యాన్ వార్‌ సెకండ్‌ డే కూడా కంటిన్యూ అయింది. వి లవ్‌ మహేష్‌ బాబు అనే కొత్త హ్యాష్‌ట్యాగ్‌తో మహేష్‌ ఫ్యాన్స్ మళ్లీ నేషనల్‌ వైడ్‌ ట్రెండింగ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ తన ఫ్యావరెట్ అని మహేష్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాదు మొన్నామధ్య మహేష్ ఓ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. మేము మేము బాగానే ఉంటాం.. మీరే ఇంకా బాగుండాలి అంటూ ఫ్యాన్స్ కు పిలుపు కూడా ఇచ్చారు. అలాగే ఒకరికొకరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లు కూడా చేసుకొని మొక్కలు కూడా నాటారు. అది గమనించి మరి ఇప్పటికైన ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూల్ అవుతారో..లేక దీన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?