Samantha: చై-సామ్‌ విడాకులపై స్పందించిన సమంత తండ్రి .. ఏమన్నారంటే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 06, 2022 | 9:09 PM

తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన ఫేస్‌బుక్‌ ఒక పోస్ట్ షేర్‌ చేశాడు. అయిదేళ్ల క్రితం షేర్‌ చేసిన సమంత-నాగ చైతన్య రిసెప్షన్‌ ఫొటోలను రిపోస్ట్‌ చేస్తూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

Samantha: చై-సామ్‌ విడాకులపై స్పందించిన సమంత తండ్రి .. ఏమన్నారంటే..
Chay Sam

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్ అనగానే ఠక్కున గుర్తొచ్చే జంట అక్కినేని నాగచైతన్య.. సమంత (Samantha). కొన్నేళ్లు ప్రేమలో ఉన్న వీరు.. ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట గతేడాది అక్టోబర్ నెలలో విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. వీరిద్దరు విడాకులు తీసుకోవడం ఏంటని అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు తెలియారాలేదు. ఇదిలా ఉంటే.. చై-సామ్‌ విడిపోయి ఏడాది దగ్గరవుతున్న క్రమంలో సమంత తండ్రి జోసెఫ్‌ ప్రభు ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు. దీంతో మరోసారి చై-సామ్‌ విడాకుల అంశం వార్తల్లో నిలిచింది. తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన ఫేస్‌బుక్‌ ఒక పోస్ట్ షేర్‌ చేశాడు. అయిదేళ్ల క్రితం షేర్‌ చేసిన సమంత-నాగ చైతన్య రిసెప్షన్‌ ఫొటోలను రిపోస్ట్‌ చేస్తూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

‘చాలా కాలం క్రితం నాటి జ్ఞాపకాలు. ఇప్పుడు అవి లేవు. ఇకపై ఉండవు కూడా. కాబట్టి కొత్త కథ, కొత్త జీవితం మొదలు పెడదాం’ అని ఆయన రాసుకొచ్చారు. కాగా చై-సామ్‌ విడాకుల ప్రకటన అనంతరం ఆయన స్పందిస్తూ ఈ విషయం వినగానే తన మైండ్‌ బ్లాక్‌ అయిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. చై-సామ్‌ విడాకుల విషయం వినగానే మొదట తనకు ఏం అర్థం కాలేదని, ఒక్కసారిగా కళ్ల ముందు అంతా చీకటి కమ్ముకుందన్నారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని సమంతకు చెప్పినట్లు ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి

Samantha

Samantha

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu