Anupama Parameswaran: ఎలా బ్రతకాలనేది మన చేతుల్లోనే ఉందంటున్న హీరోయిన్.. ఆ విషయంపై అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

‘‘అందరూ జీవితంలో సానుకూల దృక్పథంతో సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే అలా ఉండగలగడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందంటుంది.

Anupama Parameswaran: ఎలా బ్రతకాలనేది మన చేతుల్లోనే ఉందంటున్న హీరోయిన్.. ఆ విషయంపై అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Anupama
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2022 | 8:56 PM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఫుల్ జోష్ మీదున్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఒకరు. ఇటీవలే కార్తీకేయ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ జంటగా నటించిన ఈ మూవీ సెన్సెషన్ సృష్టించింది. హిందీలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం కార్తికేయ 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు.. సంతోషంగా ఎలా జీవించాలో చెబుతోంది. ‘‘అందరూ జీవితంలో సానుకూల దృక్పథంతో సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే అలా ఉండగలగడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందంటుంది.

‘మనం సంతోషంగా ఎలా జీవించాలన్నది మన చేతుల్లోనే ఉంది. ఆ సంతోషాన్ని మనమే సృష్టించుకోవాలి. ఏదైనా కొనడానికి వెళ్లినప్పుడు 99 వస్తువులు మంచివి దొరికినా.. ఒక్కటి సరైనది దొరకలేదని దిగులు చెందామంటే అందులో అర్థమేముంటుంది. మనకు లభించిన దానితో సంతృప్తి చెందగలిగినప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాం. ప్రతి విషయంలోనూ నేను ఇలాగే ఆలోచిస్తా. నా దగ్గర లేని దాని గురించి.. నాకు దక్కని వాటి గురించి అదే పనిగా ఆలోచిస్తూ బాధ పడటం నచ్చదు’’ అని అనుపమ చెప్పింది. ‘18 పేజెస్‌’, ‘బటర్‌ఫ్లై’ చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.