Pushpa 2: పుష్ప మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. కీలక పాత్రలో సాయి పల్లవి.?

Pushpa 2: అల్లు అర్జున్‌ హీరోగా (Allu Arjun) హీరోగా తెరకెక్కిన 'పుష్ప' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఈ సినిమా దుమ్మురేపింది...

Pushpa 2: పుష్ప మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. కీలక పాత్రలో సాయి పల్లవి.?
Pushpa 2 Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 07, 2022 | 6:40 AM

Pushpa 2: అల్లు అర్జున్‌ హీరోగా (Allu Arjun) హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఈ సినిమా దుమ్మురేపింది. కనీవినీ ఎరగని కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. సుకుమార్‌ మార్క్‌ డైరెక్షన్‌, అల్లు అర్జున్‌ స్టైల్‌ ఆఫ్‌ యాక్షన్‌ సినిమాను విజయ తీరాలకు చేర్చాయి. ఎర్ర చందనం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా మేనియా సృష్టించింది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ యాక్టింగ్‌కు దేశమే ఫిదా అయ్యింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం సిండికేట్‌కు అధిపతిగా ఎదిగిన పుష్ప జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుందన్న కథాంశంతో సుకుమార్‌ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలోనే పుష్ప2ను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్ర యూనిట్‌ సీక్వెల్‌లో సాయి పల్లవిని తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఓ కీలక పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించగా దానికి ఆమె కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. పుష్ప సీక్వెల్‌లో సాయి పల్లవి ఓ గిరిజన యువతి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకనట వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..