Suhani Kalita: పెళ్లి పీటలెక్కిన ‘మనసంతా నువ్వే చిన్నది’.. వరుడు ఎవరో తెలుసా.?
Suhani Kalita: మనసంత నువ్వే సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ అందులో వచ్చే 'తూనీగా తూనీగా' పాట కచ్చితంగా గుర్తుండే ఉంటుంది. సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ఈ పాట కూడా అదే రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది...

Suhani Kalita: మనసంత నువ్వే సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ అందులో వచ్చే ‘తూనీగా తూనీగా’ పాట కచ్చితంగా గుర్తుండే ఉంటుంది. సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ఈ పాట కూడా అదే రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ పాటలో కనిపించే అమ్మాయి పాత్ర కూడా సుపరిచతమే, పేరు తెలియకపోయినా పాట వినగానే చిన్నారి వెంటనే గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు ఆమె గురించి టాపిక్ ఎందుకని ఆలోచిస్తున్నారు కదూ! మనసంత నువ్వేలో చిన్న పిల్లగా కనిపించిన సుహాని కలిత ఇప్పుడు చాలా పెద్దదై పోయింది. అంతేకాదు తాజాగా ఈ చిన్నది పెళ్లి పీటలెక్కి ఓ ఇంటిది కూడా అయిపోయింది.
తాజాగా సుహాని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్యూటీని వివాహమాడిన వరుడు ప్రముఖ సంగీతకారుడు, మోటివేషన్ స్పీకర్. సుహాని ఇన్‌స్టాగ్రామ్‌లో హల్దీ వేడుకల నుంచి వివాహం, రిసెప్షన్ వరకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే మనసంతా నువ్వేతో పాపులర్ అయిన సుహాని.. ప్రేమంటే ఇదేరా, గణేష్, ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..