Telugu News Entertainment Actress Aishwarya Rai touches Rajinikanth feet in Ponniyin Selvan I trailer launch event, video goes viral
Aishwarya Rai: సొగసులోనే కాదు సంస్కారంలోనూ ఆమెకు సాటిలేరు.. తలైవాకు అందాల ఐశ్వర్య పాదాభివందనం
Ponniyin Selvan I: ఐశ్వర్యారాయ్.. పరిచయం అవసరం లేని పరు. అందంలో అయినా, అభినయంలో అయినా ఏ మాత్రం వంక పెట్టలేని ఈ ముద్దుగుమ్మ సినిమాలు బాగా తగ్గించింది. అయినా క్రేజ్‌లో ఏ మాత్రం తగ్గడం లేదు.
Ponniyin Selvan I: ఐశ్వర్యారాయ్.. పరిచయం అవసరం లేని పరు. అందంలో అయినా, అభినయంలో అయినా ఏ మాత్రం వంక పెట్టలేని ఈ ముద్దుగుమ్మ సినిమాలు బాగా తగ్గించింది. అయినా క్రేజ్‌లో ఏ మాత్రం తగ్గడం లేదు. 2018 లో ఫన్నే ఖాన్ సినిమాలో కనిపించిందీ నీలికళ్ల సుందరి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ అందాల తార ఓ సినిమాలో నటిస్తోంది. అదికూడా ఓ దక్షిణాది సినిమాలో. పేరు పొన్నియన్ సెల్వన్. గతంలో ఐశ్వర్యతో ఇరువర్ (తెలుగులో ఇద్దరు), గురు, రావణ్ వంటి సినిమాలు తెరకెక్కించిన మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. ఐశ్వర్యతో పాటు చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ, విక్రమ్ ప్రభు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు.
— Aishwarya as Nandini(PonniyinSelvan)’ll b Historic (@badass_aishfan) September 6, 2022
ఈ కార్యక్రమానికి రజనీకాంత్, కమల్‌హాసన్‌తోపాటు కోలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ను చూసిన ఐశ్వర్య వెంటనే ఆయనదగ్గరకు వెళ్లి కాళ్లకు నమస్కరించింది. వెంటనే ఆమెను లేపిన రజనీ తనను ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఆతర్వాత ఒకరికి ఒకరు చేతులు జోడించి నమస్కారాలు తెలుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఐశ్వర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఐశ్వర్య మనసు కూడా అందమే’, ‘ఆమె సంస్కారానికి హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా రజనీ, ఐశ్వర్యలిద్దరూ రోబో సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే.
The way she ran to her Mentor and that wholesome hug to her Guru. Respect ?