Keerthy Suresh and Samantha : ఒకేలాంటి డ్రస్ వేసుకున్న ముద్దుగుమ్మలు.. ఇద్దరిలో ఎవరు బాగున్నారు.?

ఇప్పుడు మ‌నం ఉంటున్న‌ది యూనిక్ వ‌ర‌ల్డ్. ఏదైనా స‌రే మ‌న స్పెషాలిటీ క‌నిపించాల‌నుకుంటాం. వండే వంట నుంచీ, తినే తిండి నుంచీ, కాస్ట్యూమ్స్ వ‌ర‌కు..ఏదైనా పెక్యూలియ‌ర్‌గా ఉండాలి.

Keerthy Suresh and Samantha : ఒకేలాంటి డ్రస్ వేసుకున్న ముద్దుగుమ్మలు.. ఇద్దరిలో ఎవరు బాగున్నారు.?
Samantha , Keerthy Suresh
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 07, 2022 | 12:31 PM

ఇప్పుడు మ‌నం ఉంటున్న‌ది యూనిక్ వ‌ర‌ల్డ్. ఏదైనా స‌రే మ‌న స్పెషాలిటీ క‌నిపించాల‌నుకుంటాం. వండే వంట నుంచీ, తినే తిండి నుంచీ, కాస్ట్యూమ్స్ వ‌ర‌కు..ఏదైనా పెక్యూలియ‌ర్‌గా ఉండాలి. అలా కాకుండా మ‌న స్టైల్స్ ఇంకొక‌రిని ఫాలో అయిన‌ట్టు క‌నిపించాయ‌నుకోండి… అంతే సంగ‌తులు. టాలీవుడ్‌లో స్టైల్ రేసులో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు. కేర‌క్ట‌ర్ ఏదైనా స‌రే, అకేష‌న్ ఉన్నా లేకున్నా త‌న‌దైన స్పెషాలిటీని చూపిస్తుంటారు. మేల్ స్టార్స్ లో బ‌న్నీది పై చేయి అయితే, ఫీమేల్ ఫెట‌ర్నిటీలో ఆ ప్లేస్‌ని ఈజ్‌తో కొట్టేస్తారు స‌మంత‌. సీజ‌న్ ఏదైనా స‌రే, స్టైలింగ్‌లో త‌గ్గేదేలే అంటారు సామ్‌. వెస్ట‌ర్న్ ఔట్‌ఫిట్స్ అయినా, కాట‌న్ చీర‌లైనా సామ్ చాలా తేలిగ్గా కేరీ చేస్తారు. మార్కెట్లోకి న‌యా డిజైన్స్ రాక‌ముందే డిజైన‌ర్ల‌కు త‌న ఆలోచ‌న‌లు షేర్ చేసి, స‌రికొత్త‌గా క్రియేట్ చేయించుకుంటారు. స‌మంత ఆ మ‌ధ్య ధ‌రించిన షీర్ సైడ్స్ ఉన్న గ్రే డ్ర‌స్ గుర్తుందిగా.. ఇప్పుడు టిన్సిల్ టౌన్లో న‌యా డిస్క‌ష‌న్‌కి నాంది ప‌లికింది ఈ డ్ర‌స్సే. సేమ్ టు సేమ్ స‌మంత ధ‌రించిన డ్ర‌స్సు లాంటి డ్ర‌స్సుతో ఫొటో షూట్ చేశారు మ‌న మ‌హాన‌టి

అస‌లే ఫ్యాష‌న్ ప్రియులు.. కీర్తీ డ్ర‌స్‌ని చూడ‌గ‌నే స‌మంత పిక్స్ ని వెతికి బ‌య‌ట‌పెట్టేశారు. ఈ డ్ర‌స్సు కీర్తీకి బావుందా? స‌మంత‌కు బావుందా.? అంటూ ఆరా తీస్తున్నారు. మొన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌క్కింట‌మ్మాయిలా క‌నిపించిన కీర్తీ ఇప్పుడు వెస్ట‌ర్న్ ఔట్‌ఫిట్స్ తో ఫెలో ఆర్టిస్టుల‌కు ట‌ఫ్ కాంపిటిష‌న్ ఇస్తున్నారు. సేమ్ డ్ర‌స్ అయినా స‌రే, అటు స‌మంత‌, ఇటు కీర్తీ ఇద్ద‌రూ సూప‌ర్బ్ గా క్యారీ చేశారంటూ ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇద్ద‌రికీ మంచి పెర్ఫార్మ‌ర్ల‌నే పేరుంది. ఇప్పుడు బెస్ట్ ట్రెండీ ఔట్‌ఫిట్స్ ని క్యారీ చేస్తార‌నే పేరూ తెచ్చుకున్నారు చెన్నై బ్యూటీస్‌.

(Tv9 ET Desk)

ఇవి కూడా చదవండి
Samantha And Keerthy Suresh

Samantha And Keerthy Suresh

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి