AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father Rape: మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం.. తల్లికి చిత్రహింసలు.. మూడేళ్లుగా అదే పని.. చివరికి..

బాధిత బాలిక 12వ తరగతి చదువుతోంది. తనపై జరిగిన అకృత్యాల గురించి బాలిక తన స్కూల్ టీచర్‌కి చెప్పింది. ఉపాధ్యాయురాలు ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే

Father Rape: మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం.. తల్లికి చిత్రహింసలు.. మూడేళ్లుగా అదే పని.. చివరికి..
child harassment
Jyothi Gadda
|

Updated on: Sep 07, 2022 | 12:08 PM

Share

Wardha News: కన్నతండ్రే ఆ కూతురిపట్ల కర్కశంగా ప్రవర్తించాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ తండ్రి కీచకుడిగా మారి కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని ఆ బాలిక… తనలో తానే మదనపడిపోయింది. తల్లికి తెలిసినా, తండ్రి పెట్టే చిత్రహింసలకు భయపడి అడ్డుకోలేకపోయింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర వార్ధా జిల్లాలో చోటు చేసుకుంది. కన్నతండ్రే తన 17 ఏళ్ల కూతురిపై గత కొన్ని సంవత్సరాలుగా లైంగికంగా వేధిస్తున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అల్లీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన సంఘటన ఇది. కామ పిశాచిగా మారిన ఆ తండ్రికి ఎట్టకేలకు పోలీసులు సంకేళ్లు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

వార్ధా జిల్లా అల్లీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటనలో..కీచక తండ్రి తన కూతురిపై నిత్యం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒకటి రెండు రోజులు కాదు.. గత మూడేళ్లుగా అతడు అదే దారుణానికి పాల్పడుతున్నాడు.అంతేకాదు బాలికపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఆమె తల్లికి కూడా తెలుసు. అయితే ఈ సమాచారం బయటకు వెళ్లకుండా భార్యను తీవ్రంగా కొట్టి వేధించేవాడు. గత మూడేళ్లుగా ఇదే జరుగుతోంది. అయితే నిత్యం వేధింపులు భరించలేక బాధిత బాలిక జరిగినదంతా తన స్కూల్ టీచర్‌కి చెప్పింది. దాంతో ఈ షాకింగ్ ఘటన బహిర్గతమైంది.

బాధిత బాలిక 12వ తరగతి చదువుతోంది. తనపై జరిగిన అకృత్యాల గురించి బాలిక తన స్కూల్ టీచర్‌కి చెప్పింది. ఉపాధ్యాయురాలు ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీకి, చైల్డ్‌లైన్‌ కేంద్రానికి సమాచారం అందించింది. వెంటనే అల్లీపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో హంతక తండ్రిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణను పోలీసు ఇన్‌స్పెక్టర్ సునీల్ గాడే నిర్వహిస్తున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆ రాక్షస తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి