Bizarre News: ఓ మహిళా పోలీస్.. ఇద్దరు కానిస్టేబుళ్లు.. కట్ చేస్తే కథలో అదిరిపోయే ట్విస్ట్.. చివరికి ఐదుగురు
ఓ లేడీ కానిస్టేబుల్ విషయంలో జరిగిన గొడవ కాస్త.. చినికి చినికి గాలి వానలా మారింది.. ఈ వ్యవహారం కాస్త ఇద్దరి కానిస్టేబుళ్ల మధ్య కాల్పుల వరకు వెళ్లింది.
2 constables fight over ‘affair’: అదొక పోలీస్ స్టేషన్.. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది.. ఏంటో అంటూ అందరూ పరుగులు తీశారు.. అయితే.. కాల్పులు ఎవరి మధ్యనో కాదు.. ఇద్దరి కానిస్టేబుళ్ల మధ్య జరిగింది. ఓ లేడీ కానిస్టేబుల్ విషయంలో జరిగిన గొడవ కాస్త.. చినికి చినికి గాలి వానలా మారింది.. ఈ వ్యవహారం కాస్త ఇద్దరి కానిస్టేబుళ్ల మధ్య కాల్పుల వరకు వెళ్లింది. దీంతో ఇద్దరు అధికారులు సహా మొత్తం ఐదుగురిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా బహేరి పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. మహిళా పోలీసు గురించి ఇద్దరు కానిస్టేబుళ్లు సోమవారం రాత్రి తీవ్ర వాగ్వాదానికి దిగారు. వీరిద్దరికి సుమారు 20 ఏళ్లు ఉంటాయి. ఈ సమయంలో కానిస్టేబుళ్లలో ఒకరైన మోను కుమార్ స్టేషన్‌లో సర్వీస్ రివాల్వర్‌ని తీసుకుని కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఎవరికీ తగలలేదు. కాల్పులు జరిపిన తర్వాత మోను తుపాకీని పడేసి.. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు.
మోను కుమార్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాకు చెందినవాడు. డిసెంబర్ 2019లో బహేరి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఈ సమయంలో ముజఫర్‌నగర్‌కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ కూడా జనవరిలో అదే పోలీస్ స్టేషన్‌లో చేరింది. అయితే, మోను కుమార్, మహిళా కానిస్టేబుల్ ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. ఆమె బహేరి స్టేషన్‌లో పోస్టింగ్ రాకముందు నుంచి వారు గత ఏడాది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వారిద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో కానిస్టేబుల్ చాహల్ వారి సంబంధం గురించి చులకనగా వ్యాఖ్యానించాడు. ఇది ఘర్షణకు దారితీసింది. ఈ సంఘటనకు రెండు రోజుల ముందు ఇద్దరు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని.. ఇతర పోలీసులు వారిని శాంతింపజేసినట్లు సమాచారం.
ఈ విషయంపై ఎస్‌ఎస్పీ సత్యార్థ్ అనిరుద్ధ పంకజ్ విచారణ చేపట్టారు. ఈ ఘటనలో కానిస్టేబుళ్లు మోను కుమార్, యోగేష్ చాహల్, ఇన్‌స్పెక్టర్ (క్రైమ్), SHOతో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఒక పోలీసు సహోద్యోగితో ఎఫైర్‌లో పాల్గొంటే, అది వారి వ్యక్తిగత విషయం. అందులో అభ్యంతరకరం లేదా చట్టవిరుద్ధం ఏమీ లేదు.. కానీ నిర్లక్ష్యం, క్రమశిక్షణా కారణాలపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని SSP తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం