Viral Video: ప్రారంభోత్సవంలోనే కుప్పకూలిన వంతెన.. అలాగుంటది మరీ ప్రభుత్వంతో పని.. వీడియో వైరల్‌

అయితే.. బ్రిడ్జ్ కిందికి పడిపోతుందని పసిగట్టిన అధికారులు..చాకచక్యంగా వ్యవహరించారు. సదరు మహిళ అధికారిని ముందుకు పక్కకు తీసుకువెళ్లారు. దాంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Viral Video: ప్రారంభోత్సవంలోనే కుప్పకూలిన వంతెన.. అలాగుంటది మరీ ప్రభుత్వంతో పని.. వీడియో వైరల్‌
Bridge Collapses
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 07, 2022 | 3:03 PM

Bridge Collapses: మా ఊరికి బ్రిడ్జి వస్తుందని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు అక్కడి ప్రజలు..అయితే, స్థానికుల కష్టాలు చూసి చలించిపోయిన పాలకులు ఎట్టకేలకు వంతెన నిర్మించారు. ఎంతో వ్యయంతో నిర్మించిన ఆ వంతనె ప్రారంభోత్సవానికి అధికారులు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు.. కానీ, బ్రిడ్జి ప్రారంభోత్సవంలోనే అపశృతి చోటుచేసుకుంది. అలా రిబ్బన్‌ కట్‌ చేసిన ప్రారంభించారో లేదో..ఇలా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వంతెన. దాంతో అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. తమ వంతెన ఆశలు ఆవిరైనట్టేనా అనుకుంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఒక వంతెనను ప్రారంభించేందుకు అధికారులు గుమిగూడడంతో కూలిపోయిందని స్థానిక ఖామా ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నిర్మాణ నాణ్యతపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఈ చిన్న వంతెనను నిర్మించారు. వంతెనకు ముందు ఉన్న తాత్కాలిక నిర్మాణం తరచుగా విరిగిపోయేదని వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది. కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ ను ప్రారంభించేందుకు ఒక మహిళా ప్రభుత్వ అధికారి చీఫ్ గెస్ట్ గా అక్కడి అధికారులు స్వాగతించారు. ఆ..అధికారి అలా రిబ్బన్ కట్ చేసిందో లేదో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది.

ఇవి కూడా చదవండి

అయితే.. బ్రిడ్జ్ కిందికి పడిపోతుందని పసిగట్టిన అధికారులు..చాకచక్యంగా వ్యవహరించారు. సదరు మహిళ అధికారిని ముందుకు పక్కకు తీసుకువెళ్లారు. దాంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆమెను సురక్షితంగా కిందకు దించారు. ఆ..తరువాత సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇదంతా అక్కడి మీడియా, స్థానికులు ఫోటోలు, వీడియోలు తీశారు. దాంతో ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి