Viral: వామ్మో! నీ డెడికేషన్‌కు దండంరా సామీ.. అనకొండల మధ్య ఆ చదువేంది గురూ!
పాములంటేనే అందరికీ భయం. అలాంటిది భారీ సైజ్‌లో కొండచిలువలను చూస్తే ఇంకేమైనా ఉందా.? గుండె జారిపోతుందంతే..
పాములంటేనే అందరికీ భయం. అలాంటిది భారీ సైజ్‌లో కొండచిలువలను చూస్తే ఇంకేమైనా ఉందా.? గుండె జారిపోతుందంతే.. అయితే ఇక్కడొక వ్యక్తి ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. కుప్పలుగా ఉన్న కొండచిలువల మధ్య ఏం చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
వైరల్ అవుతున్న ఫోటో ప్రకారం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు భారీ సైజ్ కొండచిలువల మధ్య ఓ వ్యక్తి పుస్తకం పట్టుకుని చదువుతున్నట్లు మీరు చూడవచ్చు. దాన్ని చూడగానే నెటిజన్లు ఒకింత షాక్ కావడమే కాదు.. అతడి గుండె ధైర్యానికి ఫిదా అవుతున్నారు కూడా. ఈ ఫోటోను జయ్ బ్రేవర్ అనే వ్యక్తి తీయగా.. అతడు దీనిని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ‘Jayprehistoricpets’లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
కాగా, జయ్ బ్రేవర్ అనే స్నేక్ క్యాచర్ ‘Jayprehistoricpets’ అనే సరీసృపాల జూను నడుపుతున్నాడు. ఇందులో వివిధ జాతులకు చెందిన కొండచిలువకు ఉన్నాయి. అతడు ప్రతీదాని గురించి వివరిస్తూ దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తుంటాడు. ఇక ఆ వీడియోకు వేలల్లో లైకులు, లక్షల్లో వ్యూస్ వచ్చిపడతాయి. నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో పోస్ట్ చేశాడు.