అర్ధరాత్రి బార్‌లో అగ్నిప్రమాదం.. మూడంతస్తులను చుట్టుముట్టిన మంటలు.. పదుల సంఖ్యలో మరణాలు..

బార్‌లో మంటలు చెలరేగడంతో 12 మంది మరణించినట్టుగా తెలిసింది. మరో11 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి చెలరేగిన మంటలు

అర్ధరాత్రి బార్‌లో అగ్నిప్రమాదం.. మూడంతస్తులను చుట్టుముట్టిన మంటలు.. పదుల సంఖ్యలో మరణాలు..
Vietnam
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 07, 2022 | 1:18 PM

Vietnam: అది ఒక భారీ అంతస్తుల భవనం..పలు వ్యాపార సముదాలయాలతో నిండిన బహుళ అంతస్తుల భవనం..అందులోని ఓ బార్‌లో ఉన్నట్టుండి అగ్నిప్రమాదం సంభవించింది. బార్‌లో మంటలు చెలరేగడంతో 12 మంది మరణించినట్టుగా తెలిసింది. మరో11 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి చెలరేగిన మంటలు భవనంలోని రెండు, మూడవ అంతస్తులను చుట్టుముట్టాయి. దట్టమైన పొగ మెట్ల మీద దట్టంగా నిండిపోవడంతో కస్టమర్లు, సిబ్బంది బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. మంటల నుండి తప్పించుకోవడానికి చాలా మంది బాల్కనీలో కిక్కిరిసిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఘటన వియత్నాంలోని ఓ బార్‌లో జరిగింది. సెప్టెంబరు 6న దక్షిణ వియత్నాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 11 మంది గాయపడ్డారు. హో చి మిన్ నగరంలో ఓ షాపింగ్ మాల్‌లో ఉన్న బార్‌లో మంటలు చెలరేగి ఘోర ప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసిపడ్డ మంటలు భవనంలోని రెండు, మూడో అంతస్తులు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో కస్టమర్లు, సిబ్బంది సహా దాదాపు 40 మంది లోపల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కిచెన్‌లో చెలరేగిన మంటల కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారంచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి