Covid-19: వారెవ్వా.. ఇక కోవిడ్ వస్తే మొబైల్ యాప్ తో కనిపెట్టేయొచ్చు.. ఎలాగో తెలుసా..

కోవిడ్ సృష్టించిన అలజడి మాములుది కాదు. ఎంతో మంది కరోనా కారణంగా ప్రాణాలు క్పోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగానూ కోవిడ్ మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ప్రారంభంలో కోవిద్ పరీక్షలు చేయించుకోవాలంటే గంటల

Covid-19: వారెవ్వా.. ఇక కోవిడ్ వస్తే మొబైల్ యాప్ తో కనిపెట్టేయొచ్చు.. ఎలాగో తెలుసా..
Covid Tests With Mobile App
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 07, 2022 | 4:37 PM

Covid-19: కోవిడ్ సృష్టించిన అలజడి మాములుది కాదు. ఎంతో మంది కరోనా కారణంగా ప్రాణాలు క్పోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగానూ కోవిడ్ మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ప్రారంభంలో కోవిద్ పరీక్షలు చేయించుకోవాలంటే గంటల తరబడి క్యూలైన్లో నిల్చోవల్సి వచ్చేది. అది కూడా టెస్ట్ చేయించుకున్న నాలుగైదు రోజులకు గాని రిపోర్టు వచ్చేది కాదు. రిపోర్టు వచ్చే సరికి కొంతమంది పరిస్థితి విషమించేది. ఇలా కోవిడ్ సమయంలో కరోనా పరీక్ష చేయించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఆతరువాత ల్యాబ్ ల సంఖ్య పెంచడం, ప్రయివేట్ ల్యాబ్ లకు కరోనా పరీక్షల నిర్వహణకు అనుమతివ్వడం, ర్యాపిడ్ కిట్ లు అందుబాటులోకి రావడంతో కోవిడ్ టెస్టులు చేయించుకోవడం మానవుడికి కొంత సులభతరం అయింది. అయినా సామాన్యుడికి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలంటే కొంత భారమే. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు ఉచితం అయినా.. ప్రయివేటు కేంద్రాల్లో చేయించుకోవాలంటూ సామాన్యుడికి భారంగానే చెప్పుకోవాలి. అలాగే కొంత టైం టేకింగ్ కూడా. ఇక అలాంటి సమస్యలకు చెక్ పెడుతూ.. అతి త్వరగా గొంతును విశ్లేషించి కరోనా ఉందో లేదో తెలుసుకునే మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ఏంటి మొబైల్ యాప్ ద్వారా కోవిడ్ ఉందో లేదో తెలుసుకోవచ్చంటే నమ్మడం లేదా.. అయితే రీడ్ దిస్ స్టోరీ..

కరోనా విలయతాండవం నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పలు దేశాల్లో వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతుండగా.. వైరస్‌ నిర్ధారణను మరింత వేగంగా తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో వైరస్‌ సోకిన విషయాన్ని స్మార్ట్‌ఫోన్లలోనే క్షణాల్లో తెలుసుకునే యాప్‌ ను నిపుణులు రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సహాయంతో వ్యక్తుల గొంతును విశ్లేషించి కరోనా వైరస్ ఉందో లేదో క్షణాల్లో నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా కరోనా వైరస్‌ శ్వాసకోశ మార్గాలు, స్వరతంత్రుల్లో ప్రభావం చూపుతుంది. ఇది వ్యక్తి గొంతులో మార్పులకు దారితీస్తుందని వైద్య, ఆరోగ్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు గాను నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. గొంతును విశ్లేషించేందుకు (Voice Analysis) ఉపయోగించే మెల్‌ స్పెక్ట్రోగ్రామ్‌ (Mel-Spectrogram) సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశోధకులు ఉపయోగించారు. మూడు సార్లు దగ్గడం, నోటి నుంచి మూడు నుంచి ఐదుసార్లు బిగ్గరగా శ్వాస తీసుకోవడం చేయాలని వాలంటీర్లకు సూచించి.. వాటి ఆడియోలను రికార్డుచేశారు. వాటిని యూనివర్సిటీకి చెందిన క్రౌడ్‌ సోర్సింగ్‌ కొవిడ్‌ సౌండ్స్‌ యాప్‌లో ఉన్న ఆడియో శాంపిళ్లతో విశ్లేషించారు. ఈ ప్రక్రియలో 308 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించిన పరిశోధకులు.. ఈ కొత్త యాప్‌ తో 89 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో పనిచేసే ఈ యాప్‌.. కొవిడ్‌ను నిర్ధారించడంలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుల కంటే కచ్చితమైన ఫలితం ఇవ్వడంతోపాటు చౌకగా ఉండనుందని పరిశోధకులు వెల్లడించారు. ఖరీధైన పీసీఆర్‌ టెస్టులను చేయించుకోలేని పేద దేశాల్లో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. లక్షణాలు లేని వాళ్లలో మాత్రం ఇన్‌ఫెక్షన్‌ను అంత కచ్చితంగా గుర్తించలేక పోతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిలో మాత్రం వైరస్ ను ఈయాప్ సులభంగా గుర్తిస్తుందని చెప్పారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌లో ఇటీవల ఈ పరిశోధనను ప్రదర్శించారు. త్వరలోనే ఈయాప్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఇక కోవిడ్ టెస్టుల కోసం ఎక్కువ సేపు వేచి చూడకుండా.. తక్షణమే ఈకొత్త యాప్ తో ఫలితాన్ని తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..