Fire accident: కార్ షోరూంలో చెలరేగిన మంటలు.. ఖరీదైన కార్లు, బైక్‌లు దగ్ధం.. కోట్లలో ఆస్తినష్టం
మంటల్లో రూ 1.5 కోట్ల విలువైన ఇసుజు కార్లు అగ్నికి ఆహుతి కాగా, రూ 6-7 లక్షల విలువైన బెనెల్లి బైక్స్ అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం కారణంగా..
Fire accident: అసోం రాజధాని గువహటిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బసిస్టా ప్రాంతంలోని ఓ కారు షోరూంలో బుధవారం ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. బెనెల్లి అండ్ ఇసుజు షోరూంలో ప్రమాదవశాత్తూ చెలరేగిన మంటలు ఎగిసిపడ్డాయి..ఉవ్వెత్తున ఎగిసిపడ్డ అగ్నికిలలకు పెద్ద మొత్తంలో కార్లు, బైకులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ . 5 కోట్ల నష్టం వాటిల్లిందని అంచాన వేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
Assam | Fire broke out at a Benelli & Isuzu showroom near Basistha, Guwahati; no casualties reported
ఇవి కూడా చదవండిIsuzu cars worth at least Rs 1.5 crores burnt, while Benelli bikes worth Rs 6-7 lakhs burnt. Totaling with the property loss, we hit a Rs 4-5 crores loss: Sales executive manager pic.twitter.com/Zh4SKK5pNN
— ANI (@ANI) September 7, 2022
మంటల్లో రూ 1.5 కోట్ల విలువైన ఇసుజు కార్లు అగ్నికి ఆహుతి కాగా, రూ 6-7 లక్షల విలువైన బెనెల్లి బైక్స్ అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం కారణంగా తమకు మొత్తం రూ నాలుగైదు కోట్ల నష్టం వాటిల్లిందని షోరూం సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ వెల్లడించారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి