Viral Video: సోషల్ మీడియాను కుదిపేస్తున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి.. అతను చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజనం..
Ashok Gehlot: రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన చేసిన పనికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆలయంలో పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కరోనా సోకినప్పటి నుంచి రద్దీగా ఉండే ప్రదేశాల్లో నిత్యం మాస్క్‌లు వేసుకుంటున్నారు సీఎం అశోక్ గెహ్లాట్. నిజానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఈ నెల 1 నుంచి సెప్టెంబర్ 2 మధ్య జైసల్మేర్‌లోని రామ్‌దేవ్రాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రామ్‌దేవ్రాలోని లోకదేవత బాబా రామ్‌దేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ పూజారి. ఈ సమయంలో సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. పూజారీ తీర్థం ఇవ్వడంతోనే ఆయన మాస్క్ తీయకుండానే తాగేశారు.
ముఖ్యమంత్రి ఆలయంకు రావడంతోనే అంతా తమ కెమెరాలకు పని చెప్పారు. మాస్క్ తీయకుండానే తీర్థం తాగడం చూసిన జనం.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజనం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రామ్‌దేవ్రా ఆలయం వద్దకు సీఎం చేరుకోవడంతోనే”మోదీ.. మోదీ” అంటూ స్థానికులు నినాదాలు చేశారు.
जैसलमेर के रामदेवरा मंदिर में मुख्यमंत्री अशोक गहलोत लोक देवता बाबा रामदेव जी के समाधि के किये दर्शन वायरल वीडियो @ABPNews @iampulkitmittal pic.twitter.com/B1f3cSM7xw
— करनपुरी (@abp_karan) September 6, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం