Health benefits: యవ్వనంగా ఉండేందుకు గాడిద పాలతో సబ్బు.. ఎలా తయారు చేస్తారో తెలుసా..

అందుక‌నే ఇప్పుడు ఈ పాల‌తో త‌యారు చేయ‌బ‌డిన స‌బ్బుల‌ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నార‌ట. ఈ మేరకు..

Health benefits: యవ్వనంగా ఉండేందుకు గాడిద పాలతో సబ్బు.. ఎలా తయారు చేస్తారో తెలుసా..
Soap With Donkey Milk
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 08, 2022 | 10:05 PM

Health benefits: గాడిద పాలు చాలా మంచివని సైంటిస్టుల పరిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. గాడిద పాల‌లో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయ‌ట‌. అందువ‌ల్ల గాడిద పాల‌తో స‌బ్బుల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తున్నారు. పైగా ఈ సబ్బులు వాడితే, అందంతో పాటు నిత్య యవ్వనంగా ఉంటారని సదరు కంపెనీ చెబుతుంది. పూర్వం ఈజిప్టు మ‌హారాణి క్లియోపాత్రా కూడా గాడిద పాల‌తోనే స్నానం చేసేద‌ట‌. ఇలా గాడిద పాల‌ను స్నానానికి ఉప‌యోగిస్తే చ‌ర్మం మృదువుగా మారుతుంద‌ని, చ‌ర్మ సంర‌క్ష‌ణ క‌లుగుతుంద‌ని శాస్త్రీయంగా నిరూపించ‌బ‌డింది పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన ఆర్గానికో అనే ఓ స్టార్ట‌ప్ కంపెనీ గాడిద పాల‌తో త‌యారు చేసిన స‌బ్బుల‌ను అమ్ముతూ త‌క్కువ కాలంలోనే పేరు గ‌డించింది.

గాడిద‌పాల వ‌ల్ల మ‌న చ‌ర్మానికి వృద్ధాప్య చాయ‌లు దూరమవుతాయట. పైగా చ‌ర్మాన్ని కాంతి వంతంగా మారుస్తాయట. చ‌ర్మం మృదువుగా మారేలా చూస్తాయి. అందుక‌నే ఇప్పుడు ఈ పాల‌తో త‌యారు చేయ‌బ‌డిన స‌బ్బుల‌ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నార‌ట. ఈ మేరకు ఆర్గానికో సంస్థ‌ వ్యవస్థాపకురాలు పూజా కౌల్ చెబుతున్నారు. గాడిద పాల‌లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయ‌ని, ఇవి మొటిమ‌లను త‌గ్గిస్తాయ‌ని, చ‌ర్మ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గిస్తాయ‌ని అంటున్నారు. మ‌న దేశంలో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో గాడిద పాల స‌బ్బుల‌కు మంచి డిమాండ్ ఉంద‌ట‌. ఈ ప్రాంతాల్లోని ప‌లువురు స‌బ్బుల‌ను కాకుండా ఏకంగా గాడిద పాల‌నే తాగేందుకు ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఒక్క లీట‌ర్ గాడిద పాల‌ను రూ.1వేయి పెట్టి మ‌రీ కొంటున్నార‌ని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి