AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: టైం స్క్వేర్‌లో పంజాబీ డ్యాన్స్ హల్‌చల్‌.. రోడ్డు మధ్యలో ట్రాఫిక్‌ ఆపేసి మరీ.. వైరల్ అవుతున్న వీడియో

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో...హార్డీసింగ్‌ అనే వ్యక్తి దుబాయ్‌లో భాంగ్రాక్లాసులు చెబుతుంటాడు. తాజాగా న్యూయార్క్ టైం స్క్వేర్‌లో పంజాబీ పాటకు డ్యాన్స్ చేస్తూ

Viral video: టైం స్క్వేర్‌లో పంజాబీ డ్యాన్స్ హల్‌చల్‌.. రోడ్డు మధ్యలో ట్రాఫిక్‌ ఆపేసి మరీ..  వైరల్ అవుతున్న వీడియో
Times Square
Jyothi Gadda
|

Updated on: Sep 08, 2022 | 9:02 PM

Share

Viral video: టైం స్క్వేర్‌లో పంజాబీ డ్యాన్స్ హల్‌చల్‌.. రోడ్డు మధ్యలో ట్రాఫిక్‌ ఆపేసి మరీ.. వైరల్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రతి నిత్యం ఎన్నోరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. చిరుత, సింహం, ఏనుగు, మొసలి, కోతి, పిల్లి, కుక్క, పాములకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక మనుషులు చేసే వింత వింత పనులు, డ్యాన్సులు నెటిజన్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. విభిన్న ప్రాంతాల్లో ప్రముఖ వ్యక్తులు చేసే డ్యాన్సులు మరీ ముఖ్యంగా వైరల్‌ అవుతుంటాయ. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని ప్రముఖ ప్రాంతాల్లో న్యూయార్క్ టైం స్క్వేర్ ప్రాంతంలో పంజాబీ డ్యాన్స్ వేసిన ఒక ప్రవాస భారతీయుడి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో…హార్డీసింగ్‌ అనే వ్యక్తి దుబాయ్‌లో భాంగ్రాక్లాసులు చెబుతుంటాడు. తాజాగా న్యూయార్క్ టైం స్క్వేర్‌లో పంజాబీ పాటకు డ్యాన్స్ చేస్తూ తెగ సందడి చేశాడు. అమెరికాలోని ప్రముఖ ప్రాంతం న్యూయార్క్‌ టైం స్క్వేర్ ప్రాంతంలో ఈ భాంగ్రా డ్యాన్సర్ తన అద్భుతమైన డ్యాన్స్‌తో స్థానికులు, నెటిజన్లను ఔరా అనిపించాడు. ఆ తర్వాత ఈ వీడియోను తన ఇస్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు..దాంతో వీడియో కాస్త వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Hardy Singh (@itshardysingh)

‘నా బకెట్ లిస్టులో ఈ టిక్ కొట్టేస్తున్నా. టైం స్క్వేర్‌లో డ్యాన్స్ చేశా. ట్రాఫిక్ ఆపేసి రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేశా. పర్ఫెక్ట్ షాట్ కోసం గంట సేపు వెయిట్ చేశాం. ఆన్‌ ది స్పాట్ కొరియో ఇదంతా’ అని ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను క్యాప్షన్ చేశాడు. సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోకు 2 లక్షలపైగా వ్యూస్ వచ్చాయి. చక్కగా డ్యాన్స్ చేశారని, చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్