AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అయ్యా బాబోయ్‌.. 61 ఏళ్ల తాతకు 15 మంది భార్యలు.. 107 మంది పిల్లలు.. ఎక్కడంటే..!

ఒక వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని మీరు తరచుగా వినే ఉంటారు. కానీ ఒక వ్యక్తికి 15 మంది భార్యలు 107 మంది పిల్లలు ఉన్నారని మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు కాదా.? కానీ, అది నిజంగా జరిగింది..

Viral News: అయ్యా బాబోయ్‌.. 61 ఏళ్ల తాతకు 15 మంది భార్యలు.. 107 మంది పిల్లలు.. ఎక్కడంటే..!
Kenya Man
Jyothi Gadda
|

Updated on: Sep 08, 2022 | 8:40 PM

Share

Viral News: ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. అవన్నీ సోషల్ మీడియాలో చేరటంతో వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని విషయాలు ఆహ్లాదకరంగా ఉంటే, మరికొన్ని విషయాలు విచారకరంగా, ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇంకొన్ని అద్భుతమైనవి, ఊహించలేనివిగా ఉంటాయి. ఇలాంటి అనూహ్యమైన సంఘటన కెన్యాలో చోటుచేసుకుంది . ఒక వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని మీరు తరచుగా వినే ఉంటారు. కానీ ఒక వ్యక్తికి 15 మంది భార్యలు 107 మంది పిల్లలు ఉన్నారని మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు కాదా.? కానీ, అది నిజంగా జరిగింది..

నిజానికి ఒక వ్యక్తికి 15 మంది భార్యలు 107 మంది పిల్లలు ఉన్నారు. ఈ 61 ఏళ్ల వ్యక్తి భార్యలందరితో ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు. ఇదొక్కటే కాదు.. భార్యలందరి జీవితం సాఫీగా సాగేలా వివిధ విధులను నిర్దేశించాడు. ఈ విషయంలో అతను 700 మంది భార్యలను కలిగి ఉన్న సోలమన్ రాజు లాంటివాడని ఆ వ్యక్తి గొప్పగా చెప్పుకుంటున్నాడు. దీనిపై డేవిడ్ మాట్లాడుతూ- ‘నా హృదయం చాలా విశాలనమైది.. దానికి ఒక మహిళ సరిపోదు. ఎందుకంటే ఒక స్త్రీ భరించలేని భారం నా మనసులో ఉంది. అందుకే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నాను. ఇది మాత్రమే కాదు,తనకు 20 మంది భార్యలు ఉన్నప్పటికీ, నాకు ఎటువంటి సమస్య ఉండదు. నేను సొలొమోను రాజులా ఉన్నాను. సొలొమోనుకు 700 మంది భార్యలు 300 మంది దాసీలు ఉన్నారు. మొత్తం వెయ్యి మంది భార్యలు అని చెప్పుకొచ్చాడు.

డేవిడ్ భార్యలు కూడా అతనితో చాలా సంతోషంగా ఉన్నారు. డేవిడ్‌కు భార్య జెస్సికా కలుహానాకు 13 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఈ సందర్బంగా జెస్సికా మాట్లాడుతూ – మేము శాంతి, ఐక్యతతో జీవిస్తున్నాము. నేను నా భర్తను చాలా ప్రేమిస్తున్నానని చెప్పింది.. అదే సమయంలో డేవిడ్ భార్య డ్యూరిన్ కలుఘనా ఇలా చెప్పింది – నేను ఎవరిపైనా అసూయపడను. సామరస్యంగా జీవిస్తున్నాం అంటూ సంతోషంగా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

డేవిడ్ ఏడో భార్య రోజ్ డేవిడ్ కలుహనా మాట్లాడుతూ – మేము మంచి జీవితాన్ని గడుపుతున్నాము. మేము ఒకరినొకరు చాలా ప్రేమిస్తాము.రోజ్ డేవిడ్‌ 15 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం, డేవిడ్ వార్త సంచలనం రేపుతోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను షాక్‌కు గురయ్యేలా చేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి