Milk prices: పండుగ సీజన్‌లో ప్రజలకు షాకింగ్ న్యూస్.. పాల ధరలు మరింత పైకి.. ఆరు నెలల్లోనే రెండోసారి..
గత నెలలో పాల ధరను లీటరుకు 2-2 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే..6 నెలల్లో పాల ధరలు పెరగడం ఇది వరుసగా రెండోసారి. అంతకుముందు..
Milk prices: వచ్చే పండుగలలో పాలతో చేసిన స్వీట్‌లు మరింత ప్రియం కానున్నాయి. ఓ వైపు జంతువులకు వ్యాధి సోకి పాల ఉత్పత్తి దెబ్బతింటుంది. మరోవైపు ఖరీదైన పశుగ్రాసం కారణంగా పాల ధరలు విపరీతంగా పెరగుతున్నాయి. దేశంలోనే ప్రధానంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో ఆవులు, గెదేలలో లంపి చర్మ వ్యాధి వ్యాపించింది. దీని కారణంగా పాల ఉత్పత్తి ప్రభావితమైంది. గుజరాత్, రాజస్థాన్ తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల్లో ఈ వ్యాధి విజృంభిస్తోంది. ఉత్తరప్రదేశ్ తర్వాత ఈ రాష్ట్రాల్లోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి అవుతున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పశుగ్రాసం ధర కూడా 15-17 శాతం పెరిగింది. అంటే పాల ఉత్పత్తిలో పశువుల పెంపకందారుల ఖర్చు పెరిగి మేత ఖరీదు అయినంత మాత్రాన పాల ధర పెరగలేదు. ఖరీదైన పశుగ్రాసం పాల ధరల పెంపు భయాన్ని మరింత బలపరుస్తోంది.
మదర్ డెయిరీ, అమూల్ రెండూ గత నెలలో పాల ధరను లీటరుకు 2-2 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే..6 నెలల్లో పాల ధరలు పెరగడం ఇది వరుసగా రెండోసారి. అంతకుముందు మార్చి 6న మదర్ డెయిరీ, అమూల్, పరాగ్ మిల్క్ కూడా తమ పాల ఉత్పత్తుల ధరలను లీటరుకు రూ.2 పెంచాయి. అంటే 6 నెలల్లోనే పరాగ్, మదర్ డెయిరీ ఉత్పత్తులు లీటరుకు రూ.4 చొప్పున ఖరీదయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి